KKR vs RR|ఈడెన్‌లోను ప‌రుగుల వ‌ర‌ద‌.. న‌రైన్, బ‌ట్ల‌ర్ మెరుపు ఇన్నింగ్స్‌కి బౌల‌ర్లు బెంబేలు

KKR vs RR| స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఆర్సీబీ మ‌ధ్య బెంగ‌ళూరులో జ‌రిగిన మ్యాచ్‌లో ప‌రుగుల ప్ర‌వాహం కొన‌సాగ‌డం మ‌నం చూశాం. రెండు జ‌ట్లు క‌లిసి దాదాపు 500

  • Publish Date - April 17, 2024 / 06:37 AM IST

KKR vs RR| స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఆర్సీబీ మ‌ధ్య బెంగ‌ళూరులో జ‌రిగిన మ్యాచ్‌లో ప‌రుగుల ప్ర‌వాహం కొన‌సాగ‌డం మ‌నం చూశాం. రెండు జ‌ట్లు క‌లిసి దాదాపు 500 ప‌రుగుల‌కి పైగా ర‌న్స్ చేశారంటే ఎంత భీబ‌త్సం సృష్టించారో అర్ధ‌మ‌వుతుంది. అయితే ఇది మ‌రిచిపోక‌ముందే ఈడెన్‌లోను భీబ‌త్సం సృష్టించారు ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. లక్ష్య చేధ‌న‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అంటే మొత్తం మ్యాచ్‌లో 447ప‌రుగులు న‌మోద‌య్యాయ‌. మరోవైపు కేకేఆర్ బ్యాట్స్‌మెన్ సునీల్ నరైన్(56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌తో 109) విధ్వంసకర శతకంతో చెలరేగగా, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్(60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 నాటౌట్) ఒంటరి పోరాటంతో రాజస్థాన్‌ను గెలిపించాడు.

మంగ‌ళ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్,రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర ఫైట్ కొన‌సాగింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.. కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేసి 223 ప‌రుగులు చేసింది. సాల్ట్ తొంద‌ర‌గానే వెనుదిరిగినా కూడా న‌రైన్ మాత్రం సెంచ‌ర‌తో స‌త్తా చాటాడు. న‌రైన్‌కి తోడుగా రఘు వంశీ(18 బంతుల్లో 5 ఫోర్లతో 30), రింకూ సింగ్(9 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కో వికెట్ తీసారు. ఇక 224 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ కూడా తొంద‌ర‌గానే య‌శ‌స్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన రియాన్ పరాగ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), రోవ్‌మన్ పోవెల్(13 బంతుల్లో 26) .. జోస్ బ‌ట్ల‌ర్‌కి చ‌క్కని సహకారం అందించారు.

దూకుడుగా ఆడిన పరాగ్‌(34) ప‌రుగులు చేసి ఔట్ కాగా .. ధ్రువ్ జురెల్(2), రవిచంద్రన్ అశ్విన్(8), హెట్‌మైర్(0) నిరాశ‌ప‌రిచారు. మ‌రోవైపు రోవ్‌మెన్ పొవెల్ సాయంతో బ‌ట్ల‌ర్ 36 బంతుల్లో అర్ధ సెంచ‌రీ చేశాడు. ఒక‌వైపు పోవెల్‌(26)ను నరైన్ ఔట్ చేసినా.. బౌల్ట్(0) రనౌట్ అయినా బట్లర్ మాత్రం చెల‌రిగిపోయాడు. హర్షిత్ రాణా వేసిన 19వ ఓవర్‌లో 6, 4, 6 బాది 19 పరుగులు ద‌క్కించుకున్నాడు. ఇక చివ‌రి ఓవ‌ర్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. వరుణ్ చక్రవర్తీ వేసిన చివరి ఓవర్‌లో తొలి బంతిని సిక్సర్ బాదిన బట్లర్..తర్వాతి 3 బంతులను డాట్ చేశాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠ‌గా మారింది. అయితే ఐదో బంతికి రెండు ర‌న్స్ తీసిన బ‌ట్లర్ ఇన్నింగ్స్ చివ‌రి బంతికి సింగిల్ తీసి త‌మ జ‌ట్టుని గెలిపించాడు. మొత్తానికి ఈ విజ‌యంతో సీజ‌న్‌లో 6వ విజ‌యం ద‌క్కింది.

Latest News