విధాత, హైదరాబాద్ : కృషితో నాస్తీ దుర్బిక్షామ్ అన్నట్లుగా ఓ సాఫ్ట్ వేర్ దంపతుల చిరు ప్రయత్నం కోట్ల టర్నోవర్ తో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించేలా చేసింది. మంచి రుచి, పోషకాలు..ఆరోగ్య పరిరక్షణతో కూడిన వారి లడ్డూ బిజినెస్ ముందు ఇప్పుడు లక్షల ప్యాకెజీలతో కూడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు బలాదూర్ అయిపోయాయి. లక్ష పెట్టుబడితో మొదలు పెట్టిన లడ్డూ బిజినెస్ ఇప్పుడు రూ. 2 కోట్ల టర్నోవర్ సాధించిన సక్సెస్ స్టోరీతో సాగిపోతుంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో డేటా ఇంజనీర్లుగా స్థిరపడిన సందీప్ జోగిపర్తి, కవిత గోపు దంపతులు.. సాఫ్ట్‌వేర్ కొలువులపై ఓ దశలో విరక్తి పెంచుకున్నారు. విదేశాలలో ఉద్యోగాల కంటే సొంత గడ్డ మాతృదేశంలో ఏదైనా సాధించాలనే సంకల్పంతో భారత్‌కు తిరిగి వచ్చారు. 2020లో వీరు ప్రారంభించిన ‘లడ్డు బాక్స్’ నేడు దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన రుచులను పంచుతూ ఒక సక్సెస్ ఫుల్ స్టార్టప్‌గా నిలిచింది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం నుంచి బిజినెస్ అన్వేషణ వరకు!
ఐదేళ్లపాటు అమెరికాలో పనిచేసిన సందీప్ జోగిపర్తి, కవిత గోపు దంపతులు 2019లో హైదరాబాద్ చేరుకున్నారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి… ఏ వ్యాపారం ప్రారంభిస్తే మంచిదన్న ప్రశ్నలతో సందీప్ దంపతులు దాదాపు ఎనిమిది నెలల పాటు దేశవ్యాప్తంగా పర్యటించారు. చివరకు ఫిట్‌నెస్, ఆహార రంగంలో ఉన్న లోపాలను గమనించి, ఆరోగ్యకరమైన మిఠాయిలను ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ముందుగా రూ.లక్షతో లడ్డూ తయారీ, విక్రయాల బిజినెస్ ప్రారంభించారు.
ఆరోగ్యకరమైన తీపి.. విజయవంతమైన మలుపు!
“తీపి పదార్థాలు తిన్న తర్వాత షుగర్, డయాబెటిస్ వంటి అనారోగ్యకరమైనవి తిన్నామన్న ఆందోళనకూ దూరంగా వినియోగదారులు ఉండాలన్న ప్రధాన లక్ష్యంతో .. పూర్తి సహజమైన పద్ధతిలో లడ్డూల తయారీ బిజినెస్ ప్రారంభించారు. చక్కెర, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, వేగన్ వంటి వాటితో లడ్డులను తయారు చేసి ‘లడ్డు బాక్స్’ బ్రాండ్ పేరుతో విక్రయించడం మొదలు పెట్టారు. వీరి లడ్డూలలో పంచదార కానీ, ఎలాంటి నిల్వ ఉంచే రసాయనాలు (Preservatives) కానీ వాడరు. అలాగే ముడి పదార్థాలుగా చిరుధాన్యాలు (Millets), పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషక విలువలున్న పదార్థాలను వినియోగిస్తారు. శాకాహారుల కోసం ప్రత్యేకంగా వేగన్ (Vegan) లడ్డూలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇవే వారి బిజినెస్ విజయ రహస్యంగా కొనసాగతూ ‘లడ్డు బాక్స్’ ఓ భారీ వ్యాపారంగా విస్తరించింది.
విజయపథంలో ‘లడ్డు బాక్స్’
నాణ్యతకు పెద్దపీట వేస్తూ, సంప్రదాయ రుచులకు ఆధునిక ఆరోగ్యవంతమైన పదార్ధాలను జోడించి సందీప్ జోగిపర్తి, కవిత గోపు దంపతులు తయారు చేసిన లడ్డూ బాక్స్ లడ్డులు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది.
కేవలం రూ.1 లక్ష రూపాయలతో ప్రారంభమైన ఈ ఫుడ్ స్టార్టప్, నేడు రూ. 2 కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగం నుండి వచ్చి ఆహార రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ ఇంజనీర్ దంపతుల ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
gold, gold silver updates| మళ్లీ తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు
Sai Srinivas | గ్రాండ్‌గా నిశ్చితార్థం… సింపుల్‌గా పెళ్లి.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జీవితంలో కొత్త అధ్యాయం
