Sneha|నా భ‌ర్త ఓ అమ్మాయిని ల‌వ్ చేశాడు.. అందుకే భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తాయ‌న్న స్నేహ‌

Sneha: ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ‌ స్నేహ‌. అప్ప‌ట్లో స్టార్ హీరోలంద‌రితో జ‌త‌క‌ట్టి సందడి చేసింది. సం

  • Publish Date - April 18, 2024 / 10:56 AM IST

Sneha: ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ‌ స్నేహ‌. అప్ప‌ట్లో స్టార్ హీరోలంద‌రితో జ‌త‌క‌ట్టి సందడి చేసింది. సంప్రదాయ చీరకట్టులో తెలుగమ్మాయిగా కనిపించి వేలాది మంది అభిమానుల మ‌న‌సుల‌ని గెలుచుకుంది. రామదాసు, రాధ గోపాలం వంటి చిత్రాలు ఈ అమ్మ‌డికి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో స‌త్తా చాటుతుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ని షేర్ చేసుకుంటుంది. స్నేహ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..పొసెసివ్‌ నెస్ ఉండాలి కానీ అతిగా ఉండకూడదని ఆమె చెప్పుకొచ్చారు.అది ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయలేమని స్నేహ చెప్పుకొచ్చారు.

ఉదాహరణకు బయటకు ఎందుకు వెళ్తున్నావని ఈ సమయంలో వెళ్లి ఏం చేస్తావని ఇలాంటి ప్రశ్నలు భార్య భ‌ర్త‌ల మ‌ధ్య రాకూడ‌ద‌ని స్నేహ అన్నారు. మనల్ని అవతలి వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు రావు. ముఖ్యంగా ఒక‌రిపై ఒక‌రికి పూర్తి న‌మ్మకం ఉండాలి. మ‌న‌ల్ని అడిగేముందు నేను ఫలానా చోటుకు వెళ్తున్నానని ఈ సమయంలోపు వచ్చేస్తానని ముందే స‌మాచారం ఇస్తే ఎలాంటి ప్రాబ్ల‌మ్ రాదు. ఇక అక్క‌డికి వెళ్లాక స‌మ‌యం ఉంటే మీ భాగ‌స్వామికి కాల్ చేని నేను వ‌చ్చేసాను. భోజ‌నం చేశావా అంటూ మాట్లాడితే స‌మ‌స్యే ఉండ‌దు. ఇలాంటి చిన్న చిన్న విష‌యాలే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌, న‌మ్మ‌కం పెంచుతాయ‌ని తెలియ‌జేసింది స్నేహ‌. పెళ్లైన కొత్తలో నేను కూడా కొంత పొసెసివ్‌గా ఉండేదాన్ని, అలా అని ఆయ‌న‌పై నాకు న‌మ్మ‌కం లేదని కాదు అంటూ స్నేహ పేర్కొంది.

ప‌నిలో ప‌నిగా త‌న భ‌ర్త ల‌వ్ స్టోరీ గురించి కూడా వివ‌రించింది స్నేహ‌. గతంలో నా భర్త ఒక అమ్మాయిని ప్రేమించాడని కానీ వారికి బ్రేకప్ అయిందని తెలియ‌జేసింది. అయితే దాని వ‌ల‌న ఎలాంటి స‌మ‌స్య లేద‌ని పేర్కొంది. అయితే బ్రేక‌ప్ జ‌రిగి ఉండ‌క‌పోతే నాకు ప్ర‌స‌న్న లాంటి మంచి భ‌ర్త దొరికేవాడు కాదు అంటూ స్నేహ చెప్పుకురావ‌డం విశేషం. ప్ర‌స్తుతం స్నేహ ఇండ‌స్ట్రీలో ఉంటూ త‌న భ‌ర్త ప్ర‌స‌న్న‌తో క‌లిసి వ్యాపారం కూడా చేస్తుంది. స్నేహాలయ సిల్క్స్ పేరిట ఈ అమ్మ‌డు బిజినెస్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.

Latest News