Site icon vidhaatha

Hyderabad | హైద‌రాబాద్‌లో కాల్పుల క‌ల‌క‌లం.. ఒక‌రి మృతి

Hyderabad | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఒక యువ‌కుడు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న కార్వాన్( Karwan ) ప‌రిధిలోని సాబాబ్ హోట‌ల్ స‌మీపంలోని తోప్‌ఖానా( Topekhana ) వ‌ద్ద మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది.

కార్వాన్‌కు చెందిన ఆకాశ్ సింగ్( Akash Singh ) అలియాస్ చోటూ(26)ను క్రాంతి అనే యువ‌కుడికి మ‌ధ్య గ‌తంలో గొడ‌వ‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే క్రాంతి త‌న స్నేహితుల సాయంతో ఆకాశ్ సింగ్‌పై మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి కాల్పులు జ‌రిపాడు. దీంతో చోటూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిట‌ల్‌( Osmania Hospital )కు త‌ర‌లించారు. ఎలాంటి ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా తోప్‌ఖానా ఏరియాలో పోలీసులు భారీగా మోహ‌రించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Exit mobile version