విధాత: చైనాలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనాలోని గుజిహో ప్రావిన్స్‌లోని ఓ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
క్షతగాత్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.