విధాత : పీకల దాకా మద్యం సేవించాడు. ఇక ఆ మద్యం మత్తులో ఓ యువతిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆ యువతి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ఆ మందు బాబుకు తగిన బుద్ధి చెప్పింది. ఆ పోకిరిపై చెప్పు దెబ్బలతో విరుచుకుపడింది. కేవలం 20 సెకన్లలో 40 చెప్పు దెబ్బలు కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ జలౌన్ జిల్లాలోని ఓరాయి సిటీలో ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించాడు. ఇక ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేయడంతో.. ఆమె అతనికి చుక్కలు చూపించింది.
అందరూ చూస్తుండగానే.. తన రెండు చెప్పులతో అతని తలపై నాన్ స్టాప్‌గా దంచి కొట్టింది. సెకనుకు రెండు దెబ్బల చొప్పున 20 సెకన్లలో 40 సార్లు కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోను 50 వేల మంది వీక్షించగా, 530 మంది రీట్వీట్ చేశారు.