బిగ్ బాస్‌లోకి ఏడుగురు కొత్త కంటెస్టెంట్స్.. ఇక రచ్చ మరింతగా..!బుల్లితెర ప్రేక్షకులని అలరించే బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో సీజన్ 7 జరుపుకుంటుంది. ఈ షో స్టార్ కాకముందు నుండే నాగార్జున పదే పదే అంతా ఉల్టా పుల్టా అంటూ చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే షో అంతా ఉల్టా పుల్టాగా సాగుతుంది.
14 మంది సభ్యులతో సీజన్ 7 మొదలు కాగా, హౌజ్‌లోకి వచ్చిన వారి స్థానం ఫిక్స్ కాలేదు. కేవలం పవర్ అస్త్రా దక్కించుకున్న సందీప్, శివాజి, శోభా శెట్టి , ప్రశాంత్ మాత్రమే హౌజ్‌లో కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. ఇక తొలి వారం కిరణ్ రాథోడ్ హౌజ్ నుండి బయటకు రాగా, రెండో వారం షకీలా, మూడో వారం దామిని ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తుంది.
అయితే గతంలో మాదిరిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి కొందరు కంటెస్టెంట్స్‌ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 9న బిగ్ బాస్ మరోసారి లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి, ఆ ఈవెంట్ తో మరో ఆరుగురు లేదా ఏడుగురు కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారన్నది ఇంతవరకు క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది పేర్లు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముందుగా మొగలి రేకులు సీరియల్ తో పాపులర్ అయిన నటి అంజలి వపన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి, హీరోయిన్ ఫర్జానా, సురేఖావాణి కూతురు సుప్రిత, జబర్దస్త్ ఫేమ్ నరేష్, నటి పూజా మూర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి రానున్నారని సమాచారం.
ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కామన్‌గానే జరుగుతున్నాయి. గ్రూపులుగా జత కడుతున్నారు. లవ్ ట్రాక్‌లు నడిపిస్తున్నారు. గేమ్‌పై ఫోకస్ చేస్తున్నారు. రోజురోజుకి గేమ్‌పై ఫుల్ ఫోకస్ పెంచుకుంటున్న కంటెస్టెంట్స్ టైటిల్ దక్కించుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. మగాళ్లకి పోటీగా అమ్మాయిలు కూడా అద్భుతంగా గేమ్ ఆడుతుండడం విశేషం. చూస్తుంటే ఈ సారి ఒక మహిళ విన్నర్‌గా నిలుస్తుందని సమాచారం