Delhi | ఓ యువకుడు తన ప్రియురాలిని చంపేశాడు. అదే రోజు వేరే యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ సమీపంలోని మిత్రాన్ గ్రామానికి చెందిన దాబా నిర్వాహకుడు సాహిల్ గహ్లోత్(24) గత కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి నిక్కీ యాదవ్ సాహిల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ సాహిల్ మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఈ విషయం నిక్కీ యాదవ్‌కు తెలియడంతో సాహిల్‌ను నిలదీసింది. పెళ్లి విషయమై ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నిక్కీని సాహిల్‌ను మొబైల్ కేబుల్ వైర్‌ను గొంతుకు బిగించి చంపేశాడు.
దాబాలోని ఫ్రిజ్‌లో నిక్కీ డెడ్‌బాడీని ఉంచి, అదే రోజు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు వెళ్లాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సాహిల్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు సాహిల్.