Site icon vidhaatha

Allu Arjun: నాలుగోసారి జ‌తక‌ట్టిన త్రివిక్ర‌మ్- అల్లు అర్జున్.. ఈ సారి మ‌హాభార‌తంపై ఫోక‌స్ పెట్టాడా..!

Allu Arjun: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి. మ‌హేష్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్‌పై అంద‌రి దృష్టి ఉండ‌గా, ఇదే స‌మ‌యంలో అల్లు అర్జున్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ సెట్ అయిన‌ట్టు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు వ‌చ్చిన జులాయి, స‌న్ ఆఫ్ స‌త్యమూర్తి, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాలు మంచి విజ‌యాలు సాధించాయి. దీంతో ఇప్పుడు ఈ కాంబోలో రాబోతున్న నాలుగో సినిమాపై అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్ప‌టికే బ‌న్నీ పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటుతున్నాడు. మ‌రి అలాంటి హీరోతో త్రివిక్ర‌మ్ ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేయ‌బోతున్నాడా అంటూ ప్ర‌తి ఒక్క‌రు క్యూరియాసిటీతో ఉన్నారు.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలతోనే అల‌రిస్తూ వచ్చారు. మ‌రి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా అంటే ఫ్యామిలీ నేప‌థ్యంతో చేస్తే పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాదు. వంద‌ల కోట్లు పెట్టి తీయ‌బోవు సినిమా ఎలా ఉంటుంది, ఏ జాన‌ర్‌లో చిత్రం చేయ‌నున్నాడు అని ఇప్పుడు ఇండ‌స్ట్రీలో తెగ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చిత్ర కథకి సంబందించిన లీకులు మొదలయ్యాయి. త్రివిక్ర‌మ్‌కి పురాణాల‌పై చాలా ప‌ట్టు ఉంది. ఆయ‌న ఎన్నో పుస్తకాలు చ‌దివారు. ప‌లు స‌భ‌ల‌లో స్పీచ్ లు ఇచ్చిన‌ప్పుడు మహాభారతం, రామాయణం గురించి త‌ర‌చు చెబుతుంటారు. వాటిపై త్రివిక్ర‌మ్‌కి చాలా ప‌ట్టు ఉన్న నేప‌థ్యంలో ఈ సారి మహాభారతంలోని ఓ పర్వం తీసుకుని దానితో సోషియో ఫాంటసీ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

మ‌హాభారతంలోని ఒకే ఒక‌ అంశాన్ని తీసుకుని విజువల్ వండర్ గా తీర్చిదిద్దగలిగే ఫాంటసీ కథని త్రివిక్ర‌మ్ సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం.. పౌరాణికం, జాన‌ప‌దంలా కాకుండా సోషియో ఫాంట‌సీగా చిత్రాన్ని రూపొందించే ప‌నిలో త్రివిక్ర‌మ్ ఉన్నాడ‌ట‌. ఇక బన్నీని ఎలా చూపిస్తాడ‌నేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనుండ‌గా, ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంద‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ . త్రివిక్రమ్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తి కాగానే బ‌న్నీ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టి వీలైనంత త్వ‌ర‌గా సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు.

Exit mobile version