Site icon vidhaatha

Al Pacino | 83 ఏండ్ల వ‌య‌సులో నాలుగో బిడ్డ‌కు తండ్రి కాబోతున్న న‌టుడు

Al Pacino | హాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు, ది గాడ్ ఫాద‌ర్ సిరీస్ న‌టుడు ఆల్ పాసినో 83 ఏండ్ల వ‌య‌సులో నాలుగో బిడ్డ‌కు తండ్రి కాబోతున్నాడు. ఆల్ పాసినో ప్రేయ‌సి మ‌రో నెల రోజుల్లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఆల్ పాసినో 29 ఏండ్ల వ‌య‌సున్న నూర్ అల్పాల్లా(చిత్ర నిర్మాత‌)ను ప్రేమించి, పెళ్లాడాడు. ఈ జంటకు క‌రోనా స‌మ‌యంలో ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా, అది కాస్త ప్రేమ దాకా వ‌చ్చింది. 2022, ఏప్రిల్ నెల నుంచి ఇద్ద‌రూ డేటింగ్‌లో ఉండ‌గా, ఇప్పుడు బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు.

అయితే ఆల్ పాసినోకు ఇప్ప‌టికే ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. మాజీ ప్రియురాలు జాన్ టారెంట్‌తో ఓ కుమార్తెకు తండ్రయ్యాడు. ప్ర‌స్తుతం ఆ కుమార్తె వ‌య‌సు 33 ఏండ్లు.

ఆ త‌ర్వాత 1997 నుంచి 2003 వ‌ర‌కు బెవ‌ర్లీ డీ ఏంజెలోతో క‌లిసి ఉన్నాడు. వీరిద్ద‌రికి క‌వ‌ల‌లు ఆంటోన్, ఒలివియా జ‌న్మించారు. ప్ర‌స్తుత వారి వ‌య‌సు 22 ఏండ్లు. ఇక నూర్‌ అల్ఫాల్లా గతంలో ప్రముఖ గాయకుడు మిక్ జాగర్, బిలియనీర్ నికోలస్ బెర్గూన్‌తో డేటింగ్ చేసింది.

Exit mobile version