Site icon vidhaatha

Amitabh Bachchan | ప్రభాస్ మూవీ షూటింగ్ లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయాలు..! ఆందోళనలో అభిమానులు..!

Amitabh Bachchan | బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌. హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో బిగ్‌బీకి తీవ్రగాయాలయ్యాయి. టాలీవుడ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కే’ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడ్డారు. అమితాబ్‌ బచ్చన్‌కు గాయాలు కావడంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ముంబయిలోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అమితాబ్‌ బచ్చన్‌ తన బ్లాగ్‌లో వెల్లడించారు.

షూటింగ్‌లో పక్కటెముకలకు గాయాలైనట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. దాదాపు రెండువారాల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. అయితే, బిగ్‌బీ గాయపడ్డారనే వార్త.. ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కే’ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నది. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ వరల్డ్ రేంజ్‌లో ఈ చిత్రం రూపొందుతుండగా.. సైన్స్ ఫిక్షన్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు నాగ్‌ అశ్విన్‌. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నది.

Exit mobile version