Site icon vidhaatha

Jr Ntr | జూ. ఎన్టీఆర్‌కు యాంకర్‌ శ్యామ‌ల స‌పోర్ట్.. వదిలేయండంటూ వేడుకోలు

Jr Ntr |

చంద్ర‌బాబు అరెస్ట్‌తో టీడీపీ సంక్షొభంలో ప‌డింది. పార్టీని ఎవ‌రు ముందుకు న‌డిపిస్తారన్న దానిపై జోరుగా చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. ఈ స‌మ‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు కూce ప్ర‌స్తావ‌నకి వ‌చ్చింది. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు చంద్రబాబు అరెస్టు పైన కానీ, తెలుగుదేశం పార్టీ విషయం గురించి కూడా స్పందించింది లేదు.

ఆయ‌న ఇవేమి ప‌ట్ట‌న‌ట్టు త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు. ఇక తాజాగా తాను న‌టిస్తున్న దేవ‌ర సినిమా షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి దుబాయ్‌కు వెళ్లారు. ఇలా ఎన్టీఆర్ స‌డెన్‌గా దుబాయ్ ట్రిప్ వేయ‌డానికి కార‌ణం ఏంట‌ని అంద‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న కొడుకు అభిరామ్ తో దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో పాటు యాంక‌ర్ హిమ‌జ‌తో క‌లిసి ఫొటో కూడా దిగాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్- హిమ‌జ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ దుబాయ్‌కి ఎందుకు వెళ్లాడంటే.. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్నేష నల్ మూవీ అవార్డ్స్ వేడుకలో ఆయన పాల్గొననున్నారు.

బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఎన్టీఆర్ సైమా అవార్డు ద‌క్కించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, దానిని ద‌క్కించుకునేందుకు ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లిన‌ట్టు స‌మాచారం. ఉత్త‌మ న‌టుడి కేట‌గిరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్, సిద్దు జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్, అడివి శేష్ టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడు కేటగిరిలో పోటీ పడుతున్న విష‌యం తెలిసిందే.

అయితే చంద్రబాబు అరెస్ట్‌తో నారా ఫ్యామిలీతో పాటు నంద‌మూరి ఫ్యామిలీ కాస్త ఆందోళ‌న‌లో ఉండ‌గా, ఎన్టీఆర్ మాత్రం అవేమి ప‌ట్ట‌న‌ట్టు ఉన్నాడు. ఇటీవ‌ల ఎన్టీఆర్ ప్ర‌వ‌ర్త‌న అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. అసెంబ్లీలో భువనేశ్వ‌రిపై వైసీపీ నాయకులు దారుణ‌మైన కామెంట్స్ చేసిన‌ప్పుడు జూనియ‌ర్ స్పందించిన తీరుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక నంద‌మూరి తార‌క‌ర‌త్న శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌లో కూడా ఎన్టీఆర్ పాల్గొన‌క‌ పోవ‌డంతో జూనియ‌ర్‌ని కొంద‌రు టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.