నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించి చిత్రం భగవంత్ కేసరి. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా, శ్రీలీల కీలక పాత్రలో మెరిసింది. అక్టోబర్ 19న చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో అనేక ఆసక్తికర విషయాలు రివీల్ చేస్తున్నారు చిత్ర బృందం. తాజా ఇంటర్వ్యూలో అనీల్ రావిపూడి శ్రీలీలతో తనకున్న బంధుత్వాన్ని బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. శ్రీలీల తనకు వరసకు అక్క కూతురు అవుతుందని చెప్పుకొచ్చిన ఆయన ఎలా బంధువులు అవుతారా కూడా వివరించాడు.
కర్ణాటక నుండి శ్రీలీల వచ్చిందని చాలా మందికి తెలుసు. శ్రీలీల తల్లి స్వర్ణ సొంత ఊరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు. ఇక దర్శకుడు అనిల్ సొంతూరు కూడా అదే. అయితే అందాల ముద్దుగుమ్మ శ్రీలల పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాల్లోనే అయినా.. సెలవుల్లో ఏటా పొంగులూరు వచ్చేదని అనీల్ స్పష్టం చేశాడు. అమ్మమ్మ దగ్గర చాలా రోజుల పాటు ఉండేదని అన్నాడు.
తనకి శ్రీలీల వరసకి కోడలు అవుతుందని తెలియజేశాడు.అయితే షూటింగ్ సమయంలో ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారట. సెట్స్‌లో అందరు ఉన్నప్పుడు అనిల్‌ను డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేనప్పుడు మాత్రం ‘మామయ్య’ అంటూ తెగ ఆటపట్టించేదట. ఈ విషయం తెలిసాక ప్రేక్షకులు కూడా స్టన్ అవుతున్నారు.
ఓటమి అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనీల్ రావిపూడి, టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న శ్రీలీల ఇద్దరు బంధువులు కావడం, వారిద్దరు కలిసి భగవంత్ కేసరి చిత్రం కోసం పని చేయడం విశేషమే అంటున్నారు. అంతేకాదు చిత్రం మంచి విజయం సాధించడం పక్కా అని జోస్యం కూడా చెబుతున్నారు.
ఇక భగవంత్ కేసరి విషయానికి వస్తే అఖండ, వీరసింహారెడ్డి వంటి వరుస విజయాల తర్వాత బాలయ్య చేస్తున్న చిత్రం ఇంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటించారు. అలాగే ప్రియాంక జువాల్కర్, జాన్ విజయ్ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ఫై సాహు గార్లపాటి, హరిష్ పెద్ది ఈ సినిమాను నిర్మించగా, థమన్ స్వరాలు సమకూర్చారు