Site icon vidhaatha

Miss Shetty Mr Polishetty | అమెరికా శెట్టితో.. హైదరాబాద్ పోలిశెట్టి! చాలా ఉంది మ్యాటర్

Miss Shetty Mr Polishetty |

విధాత‌: స్వీటీ అనుష్క శెట్టి (Anushka Shetty) చాలాకాలం త‌ర్వాత ఓ రొమాంటిక్ మూవీలో న‌టిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty)’ చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత ఆమె ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటిస్తున్నాడు.

అనుష్క, నవీన్‌ల మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. అనుష్క వయసు చాలా ఎక్కువ‌. ఆమెతో పోలిస్తే న‌వీన్ పోలిశెట్టి వ‌య‌సు చాలా త‌క్కువ‌. ప్రభాస్ హోమ్ బ్యానర్ యువీ క్రియేష‌న్స్ (UV Creations) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరో హీరోయిన్ల పేర్ల తోకలను టైటిల్‌గా సెట్ చేయడం కొత్తగా ఉంది. అలాగే విడుదల చేసిన పోస్ట‌ర్లలో చాలా డిటెయిల్స్ ఇచ్చారు.

Exit mobile version