Site icon vidhaatha

ఆర్టీసీ బస్సులో ఎగిసిపడ్డ మంటలు.. బస్సులో 60 మంది

APSRTC Bus | ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి.. ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ తర్వాత బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని పెద్దపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. 60 ప్రయాణికులు, విద్యార్థులతో ఆర్టీసీ బస్సు గుడివాడ నుంచి విజయవాడ వైపు బయల్దేరింది. గుడివాడ మణికొండ రహదారిలో వెంట్రప్రగడ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేశాడు. బస్సులో నుంచి అందరూ త్వరగా దిగిపోవాలని గట్టిగా అరిచాడు.

దీంతో ప్రయాణికులు, విద్యార్థులు వేగంగా కిందకు దిగిపోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో 60 మంది తమ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే చాలా మంది తమ బ్యాగులను ఇతర వస్తువులను బస్సులోనే మరిచి కిందకు దిగారు. విలువైన వస్తువులు, డబ్బులు, బంగారు ఆభరణాలు కాలిపోయానని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version