Site icon vidhaatha

బ‌న్నీ కూతురు నోట చిట్టి చిల‌క‌మ్మ పాట‌.. ఎంత ముద్దుగా చెప్పింది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గాడ్జియ‌స్ బ్యూటీ స్నేహా రెడ్డి ముద్దుల త‌న‌య అర్హ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పిట్ట కొంచెం కూత ఘ‌నం అనేలా ఈ చిన్నారి ఎంతో అల‌రిస్తూ ఉంటుంది. అర్హ కొద్ది రోజుల క్రితం స‌మంత న‌టించిన శాకుంత‌లం సినిమాలో క‌నిపించి సంద‌డి చేసింది. చిన్నారి టాలెంట్‌కి ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోయారు. మంచి ఫ్యూచ‌ర్ ఉందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. అయితే అప్పుడప్పుడు అర్హ క్యూట్ వీడియోస్ బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోలు నెటిజ‌న్స్‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ ఉంటాయి.

సినిమా షూటింగ్‌లో కాస్త గ్యాప్ దొరికితే బ‌న్నీ త‌న పిల్ల‌ల‌తో స‌రదాగా గ‌డుపుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయ‌న అర్హతో కలిసి ఆటలాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్నేహా రెడ్డి. ఇందులో అర్హ‌ని చిట్టి చిల‌క‌మ్మ ప‌ద్యం చెప్ప‌మ‌ని అడ‌గ‌గా, అర్హ‌.. చిట్టి చిలకమ్మా అంటూ క్యూట్ గా పోయ‌మ్ చెప్పుకొచ్చింది. అర్హ టాలెంట్‌కి బ‌న్నీ తెగ మురిసిపోయాడు. ప్ర‌స్తుతం అర్హ‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అర్హ టాలెంట్‌ని పొగ‌డ‌కుండా ఏ మాత్రం ఉండ‌లేక‌పోతున్నారు నెటిజ‌న్స్.

ఇక అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవల్ హీరో గా గుర్తింపు పొందిన ఆయ‌న పుష్ప సినిమాలో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌చే విజిల్స్ వేయించాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు కూడా వ‌రించింది. ప్ర‌స్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతుంది. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాతో బ‌న్నీ క్రేజ్ మ‌రో లెవ‌ల్‌కి చేరుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. పుష్ప 2 తర్వాత బ‌న్నీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

Exit mobile version