Asteroid | విమానం సైజున్న భారీ గ్రహశకలం ప్రపంచడ వేగంతో భూమి వైపుగా దూసుకువస్తున్నదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. గ్రహశకలం కదలికల ఆలస్యంగా.. ఫిబ్రవరిలో గుర్తించినట్లు పేర్కొంది. అప్పటి నుంచి కదలికలపై నిఘా పెట్టినట్లు తెలిపింది.
ఈ గ్రహశకలానికి నాసా శాస్త్రవేత్తలు 2023ఎఫ్ జెడ్3గా నామకరణం చేశారు. ప్రస్తుతం గంటకు 67వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపుగా దూసుకువస్తుందని వివరించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం, గురువారం భూమికి 41లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
అంతరిక్షంలో చిన్నా పెద్ద కలిపి మొత్తం 30వేలకుపైగా గ్రహశకలాలు తిరుగుతున్నాయని, ఇందులో సుమారు 850 శకలాలు భారీ పరిమాణంలో ఉన్నాయని నాసా తెలిపింది. కిలోమీటర్ల పొడవున్న అంతరిక్ష శకలాలు ఇందులో ఉన్నాయని చెప్పింది.
అయితే, మరో వందేళ్ల వరకూ ఈ గ్రహశకలాలతో భూమికి వచ్చే ముప్పేమీ పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ నెల 4న 92 అడుగుల పొడువైన ఆస్టరాయిడ్ భూమికి 14లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్లిందని చెప్పింది. 5న సైతం చిన్న సైజున్న గ్రహశకలం దూసుకువెళ్తుందని నాసా తెలిపింది.