Site icon vidhaatha

Balakrishna | రికార్డులు సృష్టించాలన్నా నేనే.. వాటిని తిరగ రాయాలన్నా నేనే.. ‘లెజెండ్‌’ రీరిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్ డైలాగులు, కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్‌.. ఉర్రూతలూరించే పాటలు.. ఇలా చెప్పుకుంటూపోతే మాటలు సరిపోవు. ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు బాలయ్య. ఆ సూపర్ హిట్ చిత్రాల్లో లెజెండ్ కూడా ఒకటి. లెజెండ్‌ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు.

ఈ వేడుకలో బాలయ్య.. ‘నన్ను ఆయన ప్రతిరూపంగా నిలిపిన నా కన్నతండ్రికి పాదాభివందనం తెలియజేస్తున్నా’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ వేడుక తనకు సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండగ లాంటి అనుభూతిని కలుగజేస్తున్నదని చెప్పారు. ఎల్లుండి లెజెండ్‌ సినిమా రీరిలీజ్ అవుతుందని, మళ్ళీ వంద రోజుల పండగ జరుపుకుంటామని అన్నారు. లెజెండ్‌ సినిమా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటిలతోపాటు సినిమాలో పనిచేసిన అందరికీ బాలయ్య శుభాకాంక్షలు తెలిపారు.


మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరిస్తారని చెప్పారు. వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయాలని ప్రోత్సహిస్తారని అన్నారు. సినిమాలు నచ్చితే జనం ఎలా అభిమానాన్ని పెంచుకుంటారో కళ్ల ముందే చూస్తున్నామని చెప్పారు. రికార్డులు సృష్టించడం తనకు కొత్తకాదని అన్నారు. ఈ సందర్భంగా ‘రికార్డులు సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగు ఈ ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచింది. కాగా, లెజెండ్‌ సినిమాను ఈ నెల 30న రీరిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Exit mobile version