Site icon vidhaatha

ఓడ ఢీ కొట్టడంతో కూలిన అమెరికాలోని ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జి


విధాత : అమెరికా మేరీల్యాండ్‌ బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి మంగళవారం తెల్లవారుజామున ఓ కార్గో ఓడ ఢీ కొట్టడంతో కుప్పకూలింది. బ్రిడ్జి కూలి నీటిలో పడిపోతున్న వీడియో దృశ్యాలు వైరల్‌గా మారాయి. బాల్టిమోర్ లోని ప్రయాణికులకు రవాణా పరంగా ఈ బ్రిడ్జి మార్గం కీలకంగా కొనసాగుతుంది. బ్రిడ్జి కింది నుంచి భారీ ఓడలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నది మార్గంలో వెలుతున్న ఓ భారీ కార్గో ఓడ బ్రిడ్జి కింద నుంచి వెలుతు బ్రిడ్జిలోని ఓ భాగాన్ని ఢీ కొట్టింది. దీంతో మంటలు చెలరేగడం, ఆ వెంటనే బ్రిడ్జి కూలిపోవడం జరిగింది.


ఆ సమయంలో బ్రిడ్జిపైన వెలుతున్న వాహనాలు కింద నీటిలో పడిపోయాయి. తెల్లవారు జామున 1.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన నగరంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. బ్రిడ్జి కుప్పకూలిపోతున్న సమయంలో తీసిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఘటన నేపథ్యంలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని మూసివేస్తున్నట్లు మేరీల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ ప్రకటించింది. ప్రమాద తీవ్రతను అంచనా వేయడానికి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు చేపట్టింది.

Exit mobile version