Site icon vidhaatha

Bandla Ganesh | బండ్ల రేంజి ర్యాగింగ్.. ఇంతకూ ఎవర్ని అంటున్నాడో

Bandla Ganesh |

విధాత‌: బండ్ల గణేష్ (Bandla Ganesh).. సినిమాలు.. రాజకీయాలు.. వ్యాపారం.. ఇలా రకరకాలుగా బిజీగా ఉంటూ అప్పుడప్పుడూ చేనెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ హడావుడి చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ను దేవుడిగా కీర్తిస్తూ ఉండే బండ్ల గణేష్ నిన్న ఓ చిత్రమైన కామెంట్ పోస్ట్ చేసారు.

ఆయన సీపీఎం అంటే సీపీఎం అనాలి.. బిజెపి అంటే బిజెపి అనాలి, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి.. జనసేన అంటే జనసేన అనాలి .. అయన కన్వీనెంట్ గా ఏ పేరు చెబితే అందరూ దాన్ని ఫాలో అవ్వాలి అంతేగానీ ఎవరికీ ఆత్మాభిమానం ఉండకూడదు అంటూ ఒక పోస్ట్ చేసారు.

ప్రత్యేకించి బండ్ల గణేష్ ఎవర్నీ అందులో ప్రత్యేకంగా పేర్కొనకపోయాయినా అయన ఉద్దేశ్యం చూస్తుంటే చంద్రబాబును ఉద్దేశించి అన్నట్లుగా అర్థం అవుతోంది. ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీతో పొత్తులు. రాజకీయ అవగాహనతో వెల్లేది చంద్రబాబు ఒక్కరే. బిజెపితో కొన్నాళ్ళు పొత్తు. ఆ తరువాత బిజెపితో విడాకులు.. ఆతరువాత కాంగ్రెస్ తో స్నేహం.

మళ్ళీ ఇప్పుడు జనసేనలో బాటు బిజెపితో పొత్తుకోసం ప్లానింగ్.. ఇలా ఒక్కో సీజన్ కు ఒక్కో పార్టీతో అంటకాగే చంద్రబాబును ఉద్దేశించి ఆ కామెంట్ పెట్టారని అంటున్నారు. మొన్ననే చంద్రబాబు ఢిల్లీ ఫిల్లి అమిత్ షా తదితరులను కలిసి రావడం.. బిజెపితో పొత్తు కోసం ప్రయత్నించడం ఇదంతా చూస్తుంటే బండ్ల గణేష్ చేసిన కామెంట్ చంద్రబాబును టార్గెట్ చేసిందే అని తెలుస్తోంది.

Exit mobile version