Topless swimming allowed । అక్కడ పబ్లిక్ స్విమ్మింగ్‌ పూల్స్‌లో ‘టాప్‌లెస్‌’ ఓకే

విధాత‌: పురుషులు టాప్‌లెస్‌గా పూల్స్‌లో ఈత కొడుతుంటే మహిళలకు ఎందుకీ వివక్ష అంటూ ఓ అమ్మడు కోర్టుకెక్కింది. ఈ వివక్షను అంతం చేయడమే నా పంతం.. అని చెప్పడమేకాదు.. గెలిచింది కూడా! ఫలితం.. ఆ సిటీలో బహిరంగ స్విమ్మింగ్‌ పూల్స్‌లలో పురుషులే కాదు.. మహిళలు కూడా టాప్‌లెస్‌ (Topless swimming allowed) గా ఇక ఈత కొట్టేయొచ్చు. విధాత : జర్మనీ రాజధాని బెర్లిన్‌(Berlin)లో త్వరలో మహిళలు స్విమ్మింగ్ పూల్స్‌లో టాప్‌లెస్‌ (Topless)గా ఈత కొట్టేయొచ్చు. ఈ […]

  • Publish Date - March 12, 2023 / 03:01 AM IST

విధాత‌: పురుషులు టాప్‌లెస్‌గా పూల్స్‌లో ఈత కొడుతుంటే మహిళలకు ఎందుకీ వివక్ష అంటూ ఓ అమ్మడు కోర్టుకెక్కింది. ఈ వివక్షను అంతం చేయడమే నా పంతం.. అని చెప్పడమేకాదు.. గెలిచింది కూడా! ఫలితం.. ఆ సిటీలో బహిరంగ స్విమ్మింగ్‌ పూల్స్‌లలో పురుషులే కాదు.. మహిళలు కూడా టాప్‌లెస్‌ (Topless swimming allowed) గా ఇక ఈత కొట్టేయొచ్చు.

విధాత : జర్మనీ రాజధాని బెర్లిన్‌(Berlin)లో త్వరలో మహిళలు స్విమ్మింగ్ పూల్స్‌లో టాప్‌లెస్‌ (Topless)గా ఈత కొట్టేయొచ్చు. ఈ మేరకు సిటీ అధికారులు అనుమతులు జారీ చేశారు. సిమ్మింగ్‌ పూల్స్‌ వద్ద మహిళల పట్ల వివక్ష (Discrimination)ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదులపై ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎప్పటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందో మాత్రం ఇంకా చెప్పలేదు.

ఒక ఓపెన్‌ ఎయిర్‌ పూల్‌ (open-air pool ) వద్ద టాప్‌లెస్‌గా సన్‌బాత్‌ చేస్తున్నందుకు ఒక మహిళను పూల్‌ నిర్వాహకులు బయటకు గెంటేశారు. దీనిపై గుర్రుమన్న సదరు మహిళ.. న్యాయపోరాటం చేసింది. పురుషుల్లానే మహిళలు కూడా వారికి ఇష్టమైతే టాప్‌లెస్‌గా ఉండేందుకు అనుమతించాలంటూ సెనేట్‌ అంబుడ్స్‌పర్సన్‌ (ombudsperson) ఆఫీసులో ఆమె ఫిర్యాదు చేసింది.

దీనిపై స్పందించిన బెర్లిన్‌ అధికారులు.. ఇష్టం ఉన్న మహిళలు పబ్లిక్‌ పూల్స్‌లో టాప్‌లెస్‌గా ఈత కొట్టేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మహిళలు, పురుషులు, థర్డ్‌ జెండర్‌ మధ్య ఎలాంటి వివక్షలు ఉండవని, పైపెచ్చు తమ సిబ్బందికి కూడా తలనొప్పులు పోతాయని పూల్‌ నిర్వాహకులు అంటున్నారు. జర్మనీలోని పలు నగరాల్లో ఇప్పటికే టాప్‌లెస్‌ స్విమ్మింగ్‌కు అనుమతి ఉన్నది.

Latest News