Site icon vidhaatha

బాలకృష్ణ – అనిల్‌ రావిపుడి సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇదే..!

Balakrishna – Anilravipudi | నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ కొనసాగుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. అనిల్‌ రావిపుడి డైరెక్షన్‌లో మరో చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. చిత్రం షూటింగ్‌ ఈ నెల 8న షూటింగ్‌ మొదలుకానున్నది. సినిమా కోసం ఓ మండువా హౌస్‌ సెట్‌ వేశారని, ఇందులోనే యాక్షన్‌ ఎపిసోడ్‌తో షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నది.

ఈ చిత్రంలో బాలకృష్ణకు కూతురి పాత్రలో ‘పెళ్లి సందD’ ఫేమ్‌ శ్రీలీల కనిపించన్నది. ఇదిలా ఉండగా మరో వైపు దర్శకుడు అనిల్‌ రావిపుడి చిత్రానికి క్యాస్టింగ్‌ను ఫైనల్‌ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. బాలయ్య చిత్రంలో విలన్‌ కోసం బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ను తీసుకున్నారు. అలాగే హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్‌ను కథానాయిక్‌గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. చిత్రానికి మ్యూజిక్‌ థమన్‌ అందించనున్నాడు. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపుడి దర్శకత్వంలో రానున్న సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.

Exit mobile version