బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగానే సాగుతుంది. నామినేషన్స్ చాలా వాడివేడిగా సాగిన నేపథ్యంలో ఫన్నీ టాస్క్‌తో ప్రేక్షకులని బాగానే నవ్వించారు. బుధవారం ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా ఎగ్స్ సేకరించే గేమ్ ఆడించారు. ఈ గేమ్ చాలా ఆద్యంతంగా రక్తికట్టించేలా సాగింది . గ్రహంతరవాసులకి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని రెండు గ్రూపులుగా విభజించారు. అంఉల ఒక టీం గులాబీ పురం, మరో టీం జిలేబీ పురంగా విడిపోయింది. ఇందులో గులాబీ పురం సర్పంచ్‌గా శోభా శెట్టి, ఆమె మాజీ భర్తగా తేజ. ఎన్‌ఆర్‌ఐ కుర్రాడిగా యావర్, టీస్టార్ నడిపించే వ్యక్తిగా అమర్ దీప్, శోభా శెట్టితో తిరిగే వ్యక్తిగా గౌతమ్, అల్లరి చిల్లరగా తిరిగే అమ్మాయిగా పూజా నటించారు.
ఇక జిలేబీపురంలో ప్రియాంక సర్పంచ్‌గా, భోలే జోతిష్యుడిగా, సందీప్ కిల్లీకొట్టు డబ్బ ఓనర్‌గా, అశ్విని ఊరంతా వెంటపడే అందమైన అమ్మాయిగా కనిపించారు. ఇక అర్జున్ విలేజ్ రౌడీగా, అతనికి సహాయకుడిగా ప్రశాంత్ నటించారు. శివాజీ రెండు ఊర్లకి పెద్దగా నటించాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలియజేశారు. ఏ ఊరు ప్రజలు ఎక్కువగా గ్రహాంతర వాసులను సంతోషపెడతారో, వారికి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ లభిస్తుందని బిగ్ బాస్ తెలియజేశారు. ఈ టాస్క్‌లో శోభా, తేజాలు తెగ నవ్వించారు. ఎన్ఆర్ఐ కుర్రాడిగా యావర్ అదరగొట్టాడు. అమర్ దీప్ కూడా మంచి పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు . రెండు ఊర్లకి పెద్ద అయిన శివాజీ.. జిలేబీపురం సర్పంచ్ ప్రియాంకతో పులిహోర కలపడం మాములు హైలైట్‌గా లేదు.
మొత్తానికి రెండు ఊర్ల మనుషులు డ్రామా పలికించి తెగ నవ్వులు పూయించారు. ఇక అనంతరం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇద్దరు టీమ్‌ల నుంచి నలుగురు నలుగురు ఒక చోట ఉన్న ఎగ్స్ ని కింద పడకుండా తీసుకెళ్లి ఎదురుగా ఉన్న ట్రేలో పెట్టాల్సి ఉంది. ఉత్కంఠభరితంగా సాగిన గేమ్‌లో జిలేబీ టీమ్ 18 ఎగ్స్ పెట్టి విన్నర్‌గా నిలిచింది. గులాబీపురం టీమ్ 17 ఎగ్స్ మాత్రమే పెట్టారు. ఇక సందీప్ డేంజర్ అని యావర్‌తో అమర్ దీప్ చెప్పడం అందరిని ఆశ్చర్యపరించింది. అలాగే.. అమర్ దీప్ గురించి శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అతను హీరోనా, కమెడియనా? ఏంటో తేల్చుకోలేకపోతున్నాడని, ఏదోలా బిహేవ్ చేస్తున్నాడని, ఆ విషయం హౌజ్ లో చెప్పలేకపోతున్నా అని తేజతో శివాజీ చెప్పుకొచ్చాడు.