Bigg Boss7 |
బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అని చెప్పిన బిగ్ బాస్ గత సీజన్స్‌కి భిన్నంగా గేమ్స్ ఆడిస్తున్నాడు. అయితే హౌజ్‌లోకి 14 మంది హౌజ్‌మేట్స్ రాగా, వారిలో ఇప్పుడు 13మంది మాత్రమే ఉన్నారు. సందీప్ పవర్ అస్త్రాని దక్కించుకొని హౌజ్‌మేట్‌గా కన్ ఫాం అయ్యారు. ఇక కొద్ది రోజులుగా సెకండ్ హౌజ్‌మేట్‌గా కన్‌ఫాం అయ్యేందుకు హౌజ్‌మేట్స్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున..సెకండ్ హౌజ్ మేట్ గా శివాజీ కన్ఫమ్ అయ్యి పవర్ అస్త్రాను దక్కించుకున్నట్టు తెలియజేశారు. ఈ క్రమంలో అతనికి నాలుగు వారాల ఇమ్యూనిటీ దక్కనుంది .ఇక రణధీర టీమ్ ను లీడ్ చేసిన విధానం, సిచ్యుయేషన్ ను హ్యాండిల్ చేసిన తీరుకు శివాజీకి ప్రశంసలు దక్కాయి.
కాకపోతే హౌజ్ గేట్ తీయండి, నన్ను ఎలిమినేట్ చేయండి అని శివాజి చేసిన కామెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగ్. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాక బిగ్ బాస్ రూల్స్ మాత్రమే పాటించాలంటూ మరోసారి రూల్స్ గుర్తు చేశారు. ఇక గత వారం కంటెస్టెంట్స్ ఆటతీరు ఎలా ఉంది ఆడియన్స్ జడ్జ్ చేయగా, ఈ వారం కంటెస్టెంట్ల ఆటతీరును బిగ్ బాసే జడ్జీ చేశారు.
కింగ్స్ మీటర్ ద్వారా ఒక్కో కంటెస్టెంట్ పెర్ఫామెన్స్ కు రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్స్ తో రేటింగ్ అందించారు. శివాజీ (ఎల్లో), అమర్ దీప్ (గ్రీన్), షకీలా (ఆల్మోస్ట్ గ్రీన్), సందీప్ (గ్రీన్), ప్రియాంక (రెడ్), ప్రశాంత్ (గ్రీన్), యావర్ (గ్రీన్), గౌతమ్ కృష్ణ (పూర్తిగా రెడ్), సుభశ్రీ (రెడ్), దామిని (పూర్తిగా రెడ్), శోభాశ్రీ (గ్రీన్), రతిక రోజ్ (ఎల్లో), టేస్టీ తేజా (రెడ్) గా చెప్పుకొచ్చారు.
ఇక రైతు బిడ్డ ప్రశాంత్ మిర్చి మొక్కని కాపాడలేకపోయాడంటూ బిగ్ బాస్ అప్సెట్ అయ్యారు. మరో మొక్క అందించి, దీనిని బాగా చూసుకోవాలని చెప్పారు. ఇక యావర్ ఆట తీరు బాగున్నా కూడా అభిప్రాయాలని అరచి చెప్పాల్సిన పని లేదు అని చురకలంటించారు. ఇక బాడీ కోసం స్టెరాయిడ్ తీసుకున్నావంటూ గౌతమ్ కృష్ణ చేసిన కామెంట్స్ పై కూడా బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టేస్టీ తేజా హౌజ్ లో ఎప్పుడూ నిద్రపోతూ కనిపించడంపై బిగ్ బాస్ సెటైర్స్ పేల్చుతూ ఆటపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇక ఈ వారం సేఫ్ జోన్‌లోకి అమర్ దీప్, శివాజీ రాగా, వారితో పాటు ఆట సందీప్, ప్రియాంక, సుభాశ్రీ, దామిని సేఫ్ లోనే ఉన్నారు. షకీలా, ప్రశాంత్, గౌతమ్, యావర్, తేజా, శోభా శెట్టి, రతిక మాత్రం నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.