బిగ్ బాస్ సీజన్7 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే షో మొదలై నాలుగు వారాలు పూర్తి కాగా, నలుగురు కంటెస్టెంట్స్ హౌజ్ నుండి వెళ్లిపోయారు. ఇక ఈ వారం నామినేషన్స్ చాలా రంజుగా సాగింది. ఇక తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హజ్‌మేట్స్ కి రెండు టాస్క్‌లు ఇవ్వగా, ఇవి రెండు చాలా చప్పగా సాగాయి.
యావర్, శోభా శెట్టి, శివాజీ నానా రచ్చ చేశారు. బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌కి ఇచ్చిన వస్తువులని జంటలుగా వాటిని దొంగిలించాలని అన్నాడు. ఈ క్రమంలో శోభా శెట్టి, యావర్ మధ్య గట్టిగానే ఫైట్ అయింది. తేజ దొంగిలించిన వస్తువులని బయటకి వచ్చాక శోభా శెట్టి లాక్కొని దాచుకుంది. ఆమె టైట్ డ్రెస్‌లో ఆ వస్తువులని దాచుకొని మరింత బోల్డ్‌గా కనిపించింది.
ఇక శోభా శెట్టి దాచుకున్న వస్తువులని యావర్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అవి తన ప్రైవేట్ ప్లేస్‌లో ఉన్నాయని శోభా శెట్టి గట్టిగా కేకలు వేసింది.ఆ సమయంలో బిగ్ బాస్.. ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లాలని ఆదేశించారు.
ఇక టాస్క్ పూర్తయ్యాక శివాజీ, ప్రశాంత్ మొదటి స్థానం దక్కించుకొని విజేతలుగా నిలిచారు. ఇక కెప్టెన్సీ పోటీ కోసం నిర్వహించిన టాస్క్ కూడా పెద్దగా అలరించలేకపోయింది. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు తన పార్ట్నర్ తలపై ఉన్న జార్ లో బత్తాయిలు వేయాల్సి ఉంటుంది.
అప్పుడు ఎక్కువ బత్తాయిలు సేకరించి ఎవరు ఎక్కువ జ్యూస్ చేస్తే వారు విజేతగా తేల్చి చెప్పారు. ఈ టాస్క్ లో యావర్, తేజ జంట విజేతలుగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో సందీప్, అమర్ దీప్ జంట.. శివాజీ, ప్రశాంత్ జంట నిలవగా, ఎపిసోడ్‌కి పులిస్టాప్ పడింది.
ఇక గతవారం సీరియల్ బ్యాచ్ వ్యూహానికి శివాజీ బలయిన విషయం తెలిసిందే. అతడు పవర్ అస్త్ర కోల్పోయి కంటెస్టెంట్ గా ఉన్నాడు. కంటెస్టెంట్స్ అంతా కలిసి అతడి పవరాస్త్ర వెళ్లిపోయేలా చేసినా.. అడియన్స్ మాత్రం అతనికి టాప్ రేటింగ్ ఇచ్చారు.
ఇప్పటివరకు నమోదైన పోలింగ్‌లో శివాజీ నెంబర్ వన్ స్థానంలోకి దూసుకు రాగా, ఇక డైలాగ్స్ తప్ప గేమ్ ఆడని అమర్ దీప్ నాలుగో స్థానంకి వెళ్లాడు. ఇప్పటి వరకు ఎలిమినేషన్ చాలా ఆసక్తికరంగా సాగుతుండగా, ఈ వారం ఎలిమినేట్ అవుతారనేది చూడాలి.