బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న విషయం తెలిసిందే. సండే ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటి శ్రీలీల బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. వారు హౌజ్‌మేట్స్‌తో కలిసి తెగ సందడి చేశారు.
దర్శకుడు అనీల్ రావిపూడి ఒక్కొక్కరి గురించి ఆసక్తికరంగా చెబుతూ ఫన్ క్రియేట్ చేశారు. ఇక మధ్య మధ్యలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు నాగ్. అయితే చివరికి నామినేషన్స్ లో పూజ, అశ్విని, నయని పావని మాత్రమే మిగిలారు. చివరకు ముగ్గురు అమ్మాయిలే ఉండగా, ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అవుతుందని, ఆమె ఎవరు అనే ఉత్కంఠ అందరిలో కలిగింది.
ఇక భోలే..శ్రీలీలని పొగొడుతూ ఒక పాట పాడగా, ఆయన పాటకి శ్రీలీల ఫిదా అయింది. కొద్ది సేపు అనీల్ రావిపూడి, శ్రీలీల హౌజ్‌లో తెగ రచ్చ చేయగా, అనంతరం వారు బయటకు వెళ్లిపోయిన తర్వాత అశ్విని, నయనిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నాగార్జున చెప్పుకొచ్చారు.
ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అశ్విని, నయని ముందు రెండు ఫిష్ బౌల్స్ ఉంచి, వారిద్దరికీ రెండు బాటిల్స్ ఇచ్చారు. ఒక బాటిల్ ని ఫిష్ బౌల్ లో పోయగా ఇద్దరి ఫిష్ బౌల్స్ రెడ్ గా మారాయి.అనంతరం రెండవ బాటిల్ పోసారు.ఆ సమయంలో అశ్విని ఫిష్ బౌల్ కలర్ మారింది. కానీ నయని ఫిష్ బౌల్ మాత్రం అలాగే రెడ్ ఉండడంతో నయని ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున ప్రకటించారు.
తాను వచ్చిన ఒక వారంలోనే ఎలిమినేట్ కావడంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆమెని ఇంటి సభ్యులు ఓదార్చిన కూడా కంట్రోల్ చేసుకోలేకపోయింది. నాగార్జున దగ్గరకు వెళ్లాక కూడా నయని ఏడుస్తూనే ఉంది. వచ్చిన వారం రోజుల్లోనే అందరితో తనకి మంచి బాండింగ్ ఏర్పడిందని, ఇలా వెళతానని అస్సలు ఊహించలేదని నయని అంది.
ఆమె మాటలకి కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. అయితే నయనిని బయటకు పంపాక నాగార్జున ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఒక బాక్స్ చూపించి ఇందులో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు హౌస్ లోకి వెళతారు అని చెప్పారు. అయితే బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి అనేది బిగ్ బాస్ ఇష్టం అని నాగార్జున తెలియజేశారు. అంటే నయని పావని నిజంగానే ఎలిమినేట్ కాలేదా అని అందరు ఆలోచనలు చేస్తున్నారు.