Bihar | బీహార్ గోపాల్‌గంజ్ జిల్లా జైల్లో శనివారం జైలు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఓ ఖైదీ వద్ద మొబైల్ ఫోన్ ఉండటంతో.. తనిఖీల్లో తాను దొరికిపోతామోనని భయపడ్డాడు. దీంతో ఓ వైపు అధికారులు తనిఖీలు చేస్తుండగా, సదరు ఖైదీ తన వద్ద మొబైల్‌ను మింగేశాడు. ఈ విషయాన్ని జైలు అధికారులు ధృవీకరించారు. మొబైల్‌ను మింగిన ఖైదీని ఖైషర్ అలీగా పోలీసులు గుర్తించారు.
అయితే అలీ ఆదివారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆ ఖైదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, జరిగిన విషయం చెప్పాడు. దీంతో జైలు అధికారులు షాక్‌కు గురయ్యారు. అయితే జైల్లో ఖైదీలు సెల్‌ఫోన్లు వినియోగించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే.