Site icon vidhaatha

‘గండికోట’ హోదాకు గండి.. క్యాబినెట్ హోదా హుష్ కాకి.!

ఉన్న‌మాట‌: ఆంధ్రాలో గంటకోసారి వాన పడుతూ మళ్ళీ ఎండెక్కుతున్నట్లే పాపం ఈ ఎమ్మెల్యే హోదా కూడా కేబినెట్ స్థాయిలో ఉన్నట్లుంటూనే మళ్ళీ మామూలు స్థాయికి దిగిపోతోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సన్నిహితుడిగా ముద్ర పడిన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి మొన్నటివరకూ ఉన్న కేబినెట్ హోదా ఇప్పుడు లేకుండా పోయింది. కాంగ్రెసును వీడిన జగన్ వెంట నడిచినవాళ్ళలో శ్రీకాంత్ రెడ్డి ఒకరు. జగన్ ముఖ్యమంత్రి అయితే శ్రీకాంత్ రెడ్డి ఖచ్చితంగా మంత్రి అవుతారని అందరూ భావించారు.

అనుకున్నట్టే జగన్ అయితే ముఖ్యమంత్రి అయ్యారు కానీ వేర్వేరు కులసమీకరణాల నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి మాత్రం మంత్రి కాలేకపోగా ఆయనకు ఊరడింపుగా అసెంబ్లీ చీఫ్ విప్ పదవిని ఇచ్చిన జగన్ ఆయన్ను కాస్త కూల్ చేశారు. ఇది మంత్రిపడవికి సమానం కాకున్నా కేబినెట్ హోదా రాష్ట్రవ్యాప్త గుర్తింపు, ప్రోటోకాల్ ఉండే పదవి కావడంతో కొన్నాళ్ళు ఆయన సంతోషంగానే ఉన్నారు.

అయితే మూడేళ్ళు తిరిగేసరికి మలి విడత విస్తరణలో అయినా ఆయన మంత్రి అవుతారని అంతా అనుకున్నారు. కానీ మంత్రి పదవి రాలేదు కదా ఉన్న పదవి ఊడింది. అదెలా అంటే ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు చీఫ్ విప్ పదవిని కట్టబెట్టిన జగన్ శ్రీకాంత్ రెడ్డికి పవర్ కట్ చేసేశారు.

దాంతో తీవ్ర మనస్థాపానికి శ్రీకాంత్ రెడ్డి గురి అయ్యారని అంతా అంటున్నారు. తనకు మంత్రి పదవి న్యాయంగా ఇవ్వాలి. పోనీ అది లేదు కాదు అనుకుంటే ఉన్న పదవి అయినా కంటిన్యూ చేయాలి కానీ ఉన్నది తీసేస్తే ఎలా అని శ్రీకాంత్ రెడ్డి అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. కానీ జగన్ మాత్రం సామాజిక సమీకరణలు ఇతర లెక్కలు బేరీజు వేసుకుని. నిర్ణయాలు తీసుకుంటారు తప్ప సొంతవారు.. పరాయివారు అన్నా తేడాలు ఉండవు అని ఆయన మనసెరిగినవారు అంటున్నారు.

Exit mobile version