Divorce | కెనడా ప్రధాని ట్రూడో దంపతుల తెగతెంపులు

Divorce విధాత: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన సతీమణి సోఫీ గ్రెగోయిర్‌ దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జస్టిన్ ట్రూడో (51), ఆయన సతీమణి సోఫీ గ్రెగోయిర్‌ (48) అధికారిక ఇన్‌స్టా‌గ్రామ్‌‌లో పోస్ట్‌లు పెట్టారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా అర్థవంతమైన, కష్టతరమైన చర్చలు జరిపినట్టు ఇరువురూ తెలిపారు. పబ్లిక్ అప్పీరియన్స్‌లో వీరు ఎప్పుడూ హ్యాపీ కపుల్ గా కనిపిస్తుంటారు. అలాంటి ముచ్చటైన ఈ దంపతులు […]

  • Publish Date - August 3, 2023 / 12:00 PM IST

Divorce

విధాత: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన సతీమణి సోఫీ గ్రెగోయిర్‌ దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జస్టిన్ ట్రూడో (51), ఆయన సతీమణి సోఫీ గ్రెగోయిర్‌ (48) అధికారిక ఇన్‌స్టా‌గ్రామ్‌‌లో పోస్ట్‌లు పెట్టారు.

ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా అర్థవంతమైన, కష్టతరమైన చర్చలు జరిపినట్టు ఇరువురూ తెలిపారు. పబ్లిక్ అప్పీరియన్స్‌లో వీరు ఎప్పుడూ హ్యాపీ కపుల్ గా కనిపిస్తుంటారు. అలాంటి ముచ్చటైన ఈ దంపతులు విడిపోవాలని నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

వీరికి జేవియర్ (15), ఎల్లా-గ్రేస్ (14), హాడ్రియన్ (9) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతులుగా చట్టపరంగా విడిపోయిన తర్వాత కూడాఎప్పటిలాగే తమ మధ్య ఏర్పడిన లోతైన ప్రేమ, గౌరవం ఇక ముందు కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు..పిల్లల శ్రేయస్సును గౌరవిస్తూ వారి గోప్యతకు భంగం కలగకుండా చూడాలన్నారు.

చట్టపరమైన విడాకుల ఒప్పందంపై ఇద్దరూ సంతకాలు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 2005మేలో ట్రూడో, సోఫీల వివాహాం జరిగింది. కాగా పదవిలో ఉన్నప్పుడు విడిపోతున్నట్లు ప్రకటించిన రెండవ కెనడా ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో నిలిచారు. జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ట్రూడో కూడా 1979లో అతని భార్య మార్గరెట్ నుంచి విడిపోయారు.

Latest News