విధాత: గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ నుంచి చైనా బలగాలుల వెనక్కి వెళ్లాయి. సైన్యం ఉపసంహరణకు ముందు చైనా భారీ స్థావరం ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకు వచ్చాయి. డ్రాగన్ ప్రస్తుతం సైనిక స్థావరం ఆనవాళ్లు లేకుండా చేసింది.
చైనా బలగాలు ఇప్పుడు 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్లాయి. భారత్‌తో 16వ రౌండ్ చర్చల తర్వాత బలగాలను ఉప సంహరించుకున్నది. బఫర్ జోన్‌లో పెట్రోలింగ్ నిర్వహించకూడదని భారత్ నిర్ణయించింది. దెప్సాంగ్, తూర్పు గోగ్రా ప్రాంతాల్లో అనిశ్చితి కొనసాగుతున్నది.