Site icon vidhaatha

వ‌యాగ్రా వేసుకుని అత్యాచారం.. తీవ్ర ర‌క్త‌స్రావంతో యువ‌తి మృతి

Uttar Pradesh | విధాత: ఓ యువ‌కుడు కామంతో చెల‌రేగిపోయాడు. ఒంటిరిగా ఉన్న యువ‌తిపై క్రూర మృగంలా విరుచుకుప‌డ్డాడు. త‌న స‌త్తా ఏంటో చూపించాల‌నే ఉద్దేశంతో వ‌యాగ్రా వేసుకుని అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి ప్ర‌యివేటు భాగాల్లో తీవ్ర ర‌క్త‌స్రావమై చ‌నిపోయింది. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ్ గౌత‌మ్(25) అనే యువ‌కుడు.. ఓ యువ‌తిపై క‌న్నేశాడు. ఆ యువ‌తి ఇంట్లో ఒంట‌రిగా ఉన్న విష‌యాన్ని గ్ర‌హించాడు. ఇంకేముంది వ‌యాగ్రా వేసుకోని ఆమె ఇంటికి వెళ్లాడు. ఇక ఓ క్రూర మృగంలా ఆమెపై విరుచుకుప‌డడంతో ఆమె నొప్పి భ‌రించ‌లేక‌పోయింది. ప్రైవేటు భాగాల్లోంచి తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది.

శున‌కాలకు ఘ‌నంగా వివాహం.. భావోద్వేగానికి గురైన య‌జ‌మాని

దీంతో భ‌య‌ప‌డిపోయిన గౌత‌మ్ అక్క‌డ్నుంచి పారిపోగా తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన అక్క త‌న సోద‌రిని చూసి త‌ల్ల‌డిల్లిపోయింది. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న సోద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు గౌత‌మ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గంట గంటకు విష‌మంగా హీరో కృష్ణ ఆరోగ్యం: వైద్యులు

Exit mobile version