Site icon vidhaatha

మ‌హిళ‌కు లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ నేత అరెస్ట్

విధాత: ఓ మ‌హిళ ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించి, లైంగిక వేధింపుల‌కు గురి చేసిన కాంగ్రెస్ నాయ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. క‌ర్ణాట‌క‌లోని ధార్వ‌డ్ జిల్లాకు చెందిన మ‌నోజ్ క‌ర్జాగి.. మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌కు సన్నిహితుడు.

కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్న మ‌నోజ్.. ఓ బ్యూటీ పార్ల‌ర్‌తో పాటు సెలూన్‌ను నిర్వ‌హిస్తున్నాడు. అయితే త‌న బ్యూటీ పార్ల‌ర్‌లో ప‌ని చేసే ఓ మ‌హిళా ఉద్యోగిని ప‌ట్ల మ‌నోజ్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆమెను కౌగిలించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూ.. లైంగిక వేధింపుల‌కు గురి చేశాడు.

ఈ విష‌యాన్ని బాధిత మ‌హిళ త‌న బాయ్ ఫ్రెండ్‌కు చెప్పింది. ఇక అత‌ను త‌న ఫ్రెండ్స్‌తో బ్యూటీ పార్ల‌ర్‌కు వ‌చ్చి మ‌నోజ్‌పై దాడి చేశాడు. అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌నోజ్ క‌ర్జాగిని పోలీసులు అరెస్టు చేశారు.

Exit mobile version