Site icon vidhaatha

Medak | కంటైనర్ లారీలు ఢీకొని మంటలు.. ఇద్దరు సజీవ దహనం

Medak

విధాత, మెదక్ బ్యూరో: రెండు కంటైనర్ లారీలు ఢీకొని మంటలు లేచి ఇద్దరు వ్యక్తుల సహజీవ దహనమైన సంఘటన మెదక్ జిల్లా నార్సంగి మండలం కాస్లాపూర్ గ్రామ శివారు జాతీయ రహదారిపై జరిగింది. దీంతో లారీలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.

నార్సింగి మండలం కాస్లాపూర్ గ్రామ శివారులో 44 వ జాతీయ రహదారిపై ఆగిఉన్న ఒక కంటైనర్ లారీనీ ,వెనుక నుండి మరో కంటైనర్ లారీ డికొనడంతో మంటలు అంటుకున్నాయి.దీంతో లారీల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.

కాగా.. మృతులు కర్ణాటక రాష్ట్రం కు చెందిన నాగరాజు, బసవరాజులుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Exit mobile version