Site icon vidhaatha

అంతా ఉల్టా పుల్టా.. హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన ఫేమ‌స్ సింగ‌ర్

బిగ్ బాస్ సీజ‌న్ 7 అంతా ఉల్టా పుల్టా. ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్ బాస్ హౌజ్‌లో ఎవ‌రు ఊహించ‌ని విధంగా ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నారు. ఎలిమినేష‌న్‌లో కూడా ఎవరు ఎలిమినేట్ అవుతార‌నేది కొంత స‌స్పెన్స్‌గానే ఉంటుంది. ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున‌.. కంటెస్టెంట్స్‌తో స‌ర‌దాగా ఓ గేమ్ ఆడించారు. చిట్టీలో ఉన్న విధంగా స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. ముందుగా శోభా శెట్టిని పిలిచిన నాగ్ హౌస్ లో కన్నింగ్ ఎవరు అని అడ‌గ‌గా, ఆమె వెంట‌నే ప్ర‌శాంత్ పేరు చెప్పింది. ఇక ర‌తిక రోజ్‌ని.. తేనే పూసిన కత్తి ఎవరు అని అడగగా సందీప్ మాస్టర్ అని చెప్పుకొచ్చింది. ఇక శివాజీ..తేజ‌ని క‌లుపు మొక్క అని అన్నాడు. అనంత‌రం నాగ్ నామినేష‌న్‌లో ఉన్న ఇద్ద‌రిని సేవ్ చేశారు

మొదటి రౌండ్ లో గౌతమ్, ప్రియాంక సేఫ్ అయిన‌ట్టు ప్ర‌క‌టించడంతో వారిద్ద‌రు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక మ‌ళ్లీ గేమ్ కొన‌సాగింది. హౌస్ లో కామన్ సెన్స్ లేనిది ప్రశాంత్ కి అంటూ ప్రియాంక పేర్కొంది.ఇలా స‌ర‌దాగా కొంత సేపు గేమ్ జ‌రిగాక‌, ర‌తిక సేఫ్ అయిన‌ట్టు నాగార్జున ప్ర‌క‌టించాడు.ఇక ఆ తర్వాత స్కంద మూవీ ప్ర‌మోష‌న్ కోసం ఎనర్జిటిక్ హీరో రామ్ బిగ్ బాస్ హౌజ్‌కి వ‌చ్చాడు. ముందుగా స్కంద ట్రైల‌ర్ ప్ర‌ద‌ర్శించి ఆ త‌ర్వాత హౌజ్‌మేట్స్‌కి ప‌రిచ‌యం చేశాడు. అనంత‌రం చిన్న‌పాటి డ్యాన్స్ కాంపిటీష‌న్ జ‌ర‌గ‌గా, దానికి రామ్ ని మార్క్స్ ఇవ్వ‌మ‌ని అన్నాడు. ఇక వారి డ్యాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేసిన రామ్..కంటెస్టెంట్స్‌ని బాగానే ఉత్సాహ‌ప‌రిచాడు.

ఇక రామ్ వెళ్లిపోయిన త‌ర్వ‌త అమ‌ర్ దీప్ సేఫ్ అయిన‌ట్టు ప్ర‌క‌టించాడు నాగ్. చివ‌రిగా శుభశ్రీ, దామిని నామినేష‌న్స్ లో మిగిలి ఉండ‌గా, వారిద్ద‌రిని సీక్రెట్ రూమ్ లోకి పిలిచారు. ఇద్దరి ఫోటోలు ఉన్న రెండు షిప్ బొమ్మలు ఉండ‌గా,అందులో ఏది పేలితే వారు ఎలిమినేట్ అవుతారని నాగార్జున అన్నారు. దామిని షిప్ పేల‌డంతో ఆమె ఎలిమినేట్ అయింద‌ని నాగ్ చెప్ప‌డంతో ప్రియాంక జైన్ కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. దామినికి ఆమె ఎమోషనల్ గా ఆమెకి సెండాఫ్ ఇచ్చారు. ఇక స్టేజ్‌పైకి వ‌చ్చిన దామిని హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ కి విలువైన సూచ‌నలు చేసింది.అనంతరం బిగ్ బాస్‌పై రూపొందించిన సాంగ్ పాడి అంద‌రిని అల‌రించింది . మొత్తానికి 14 మంది కంటెస్టెంట్స్‌లో ముగ్గురు బ‌య‌ట‌కి వెళ్లిపోగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవ‌రైన ఇస్తారా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Exit mobile version