విధాత, సినిమా: నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాలో ఉన్న కంటెంట్, మాస్ ఎలిమెంట్స్, ఎదురుగా మరో సినిమా లేకపోవడం.. ఇవన్నీ ఈ సినిమాకు బాగా కలిసి వచ్చాయి.
అందుకే నాని కెరీర్‌లో ఇప్పటి వరకు చూడని లెక్కలు బాక్సాఫీస్ వద్ద నమోదు అవుతున్నాయి. మరి కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతుంటే.. నాని మాత్రం హ్యాపీగా లేడు అనేలా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు రెండు కారణాలు వినిపిస్తున్నాయి.
కారణం ఒకటికి వస్తే.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలలో మినహా.. మిగతా చోట్ల ఈ సినిమా అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోతుందనేలా టాక్ వినిపిస్తుంది. ఈ టాక్ విని నాని నిరాశగా ఉన్నాడట.
ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలైన కర్ణాటక, తమిళ నాడు, కేరళలో ఈ చిత్రం నాని అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయిందని, అందుకే అతను నిరాశగా ఉన్నాడనేలా అతని సన్నిహిత వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
Let’s celebrate the #DhoomDhaamBlockbuster with the DASARA BLOCKBUSTER DAAWATH