Site icon vidhaatha

వారాహి.. మహా గిరాకీ! డిమాండ్ పెంచేస్తున్న పవన్!

విధాత: మార్కెట్లో ఏదైనా సరుకు సప్లయ్ లేదంతే ఆ సరుకు స్టాకు ఉంచుకున్న వ్యాపారికి ఆనందం. ఎందుకంటే తన సరుకును ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు కదా.. ఒక రూట్లో వాహనాలు ఏమీ లేనపుడు ఏదైనా ఆటో కనిపిస్తే వాడు చెప్పిన రేటిచ్చి ఆటో ఎక్కాల్సిందే.. ఇదే డిమాండ్ సప్లయ్ సూత్రం..ఈ సూత్రం ఏకనామిక్స్ లోనే కాదు.. పాలిటిక్స్‌లో కూడా ఉంటుంది.

లోకేష్ పాదయాత్రకు స్పందన లేకపోవడం టీడీపీ క్యాడర్, ఆగ్ర నాయకత్వంలో కలవరం లేపుతుండగా ఇటు ఈ ఫెయిల్యూర్ చూసి చంద్రబాబు పొలిటికల్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మాత్రం లోలోన సంబర పడుతున్నారట. భావి టీడీపీ నాయకుడిగా.. యువతకు ఐకాన్ గా ప్రాజెక్ట్ చేస్తూ వచ్చిన లోకేష్ పాదయాత్ర దాదాపు చప్పబడిపోయింది.

చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలోనే లోకేష్ యాత్రకు స్పందన కరువైంది. ఇక ఈయన రాష్ట్రమంతా యాత్ర చేసి పార్టీని బలోపేతం చేస్తారన్నది కలగానే మిగిలిపోతుందని టీడీపీ డిసైడ్ అయిపొయింది. అంటే లోకేష్ ఇమేజ్, ఆయన ప్రయత్నాలు ఇప్పుడు టీడీపీకి పెద్దగా లాభించవన్న పాయింట్ సరిగ్గా పవన్ కళ్యాణ్ క్యాచ్ చేసారని అంటున్నారు.

ఇప్పుడు టీడీపీకి తానే పెద్దదిక్కు అని, తన మద్దతు కోసం వారు ఖచ్చితంగా కాళ్లబేరానికి వస్తుందన్న పాయింట్ పవన్ కళ్యాణ్ గ్రహించారు. అవసరం లేకపోయినా.. వాడకం పూర్తయినా చంద్రబాబు ఎవరికీ పైసా విలువ ఇవ్వరని, కానీ అవసరం అనుకుంటే మాత్రం ఎంతకైనా దిగజారి ఆఫర్లు ఇస్తారన్న పాయింట్ గుర్తించిన పవన్ ఇప్పుడు బెట్టు చేయడానికి రెడీ అయ్యారట.

ఎంపీ.. ఎమ్మెల్యే సీట్లతో బాటు ఇతరత్రా బేరాలు కూడా గట్టిగా ఆడాలని పవన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా మారింది. ఫో..ఫో.. వయ్యా అని పవన్ను కాదనలేరు.. అలాగని లోకేష్ పాదయాత్రను నమ్ముకుని ఒంటరీ గానూ ఎన్నికలకు పోలేరు.. ఆదన్నమాట సంగతి.

Exit mobile version