Site icon vidhaatha

Dil Raju | దిల్ రాజు.. కొత్త‌వారితో ప్రయోగాల బాట! లిస్ట్‌లో..

విధాత‌, సినిమా: తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌ను అందించాడు నిర్మాత దిల్ రాజు(Producer Dil Raju). అంతేకాకుండా ఆయన ఎందరో దర్శకులను పరిచయం చేశాడు. వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ అడ్డాల, సుకుమార్, బోయ‌పాటి శ్రీను, వాసువ‌ర్మ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, వేణు శ్రీ‌రామ్.. ఇలా చాలా మంది ఆయ‌న పరిచయం చేసిన డైరెక్టర్లలో ఉన్నారు. వీరిలో చాలా మంది నేడు స్టార్ట్ డైరెక్టర్స్‌గా పేరు పొందారు.

అయితే ఇదే సమయంలో ఆయన చిన్న సినిమాల కోసం ఓ ప్రత్యేక బ్యానర్‌ని స్థాపించాడు. ఈ బ్యానర్‌లో అతి తక్కువ బడ్జెట్‌లో చిత్రాలు నిర్మాణం చేయనున్నాడు. ప్రయోగాత్మకంగా కమెడియన్ వేణు దర్శకునిగా ‘బలగం’ అనే సినిమా తీశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. పాజిటివ్ బ‌జ్‌తో మంచి వసూళ్ల నమోదు చేస్తోంది.

తాజాగా శశి (Shashi) అనే నూతన దర్శకుడిని దిల్ రాజు బ్యానర్ ద్వారా దర్శకునిగా పరిచయం చేయనున్నాడు. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యశ్వంత్ (Yashwant) మాస్టర్‌ని హీరోగా పరిచయం చేయబోతున్నాడు. యశ్వంత్ మాస్టర్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఎన్నో షోలతో పాటు ఇతర ఫ్లాట్‌ఫార్మ్స్ ద్వారా ప్రేక్షకులు య‌శ్వంత్ మాస్ట‌ర్‌ని ఆదరించారు.

ఈసారి ఆయన ఏకంగా హీరోగా పరిచయమవుతున్నాడు. అంతేకాక ఈ సినిమా ద్వారా ఓ సింగర్‌ని సంగీత దర్శకునిగా కూడా దిల్ రాజు పరిచయం చేయబోతున్నాడట. ఇలా అంతా కొత్తవారితో చేయబోతున్న ఈ ప్రయోగం ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒకవైపు ఇలా చిన్నచిన్న చిత్రాలు తీస్తూనే మరోవైపు 250, 300 కోట్ల‌తో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చరణ్ కాంబినేషన్లో భారీ సినిమా నిర్మిస్తున్నాడు. మొత్తానికి రెండు బ్యాన‌ర్ల‌ల‌లో ఒక‌దానిలో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తూ.. మ‌రో దానిలో చిన్న, చిన్న చిత్రాల ప్రయోగాలు చేస్తూ.. ప‌లువురు కొత్త ద‌ర్శ‌కుల‌ను, నటీనటులును, ఇతర టెక్నీషియన్స్‌ను ప‌రిచ‌యం చేయాల‌నేది దిల్ రాజు ప్లాన్‌గా చెబుతున్నారు. మొత్తానికి దిల్ రాజు కొత్త‌వారితో చేయ‌బోయే ఈ ప్రయోగాలను అంద‌రూ హ‌ర్షిస్తార‌ని ఆశిద్దాం.

Exit mobile version