Site icon vidhaatha

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు సాగర్‌ కన్నుమూత

Director Sagar | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ దర్శకుడు సాగర్‌ కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాకాసిలోయ, డాకు, మావారి గోల, స్టువర్ట్‌పురం దొంగలు, పబ్లిక్‌ రౌడి, దాడి, నక్షత్రపోరాటం, భరత్‌సింహం, అమ్మదొంగ, అమ్మనాకోడలా, ఆలుమగలు, జగదేకవీరుడు, అమ్మా అమ్మనుచూడాలనివుంది, రామసక్కనోడు, ఓసీ నా మరదల, అన్వేషణ, యాక్షన్‌ నంబర్‌ వన్‌, ఖైదీ బ్రదర్స్‌, చార్మినార్‌ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే తెలుగుసినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Exit mobile version