Site icon vidhaatha

Viral Video | వీధి కుక్క వీరంగం.. చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలు

Viral Video | ఓ వీధి కుక్క వీరంగం సృష్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసింది. కుక్క దాడిలో పాప ముఖానికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ దారుణ ఘ‌ట‌న గుజ‌రాత్ సూర‌త్‌లోని హ‌న్స్‌పురా సొసైటీలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ చిన్నారి త‌న ఇంటి ముందు ఆడుకుంటుంది. అటుగా వ‌చ్చిన ఓ వీధి కుక్క‌.. ఆ పాప‌పై దాడి చేసింది. చిన్నారిని కింద ప‌డేసి, ముఖంపై తీవ్రంగా క‌రిచింది. ఆ బాధ భ‌రించ‌లేక చిన్నారి గ‌ట్టిగా ఏడ్చింది. పాప ఏడుపు విన్న ఆమె త‌ల్లి బ‌య‌ట‌కు వ‌చ్చి చూడ‌గా, కుక్క దాడి చేస్తూనే ఉంది. వెంటనే కుక్క దాడి నుంచి బిడ్డ‌ను కాపాడుకుంది.

ఇద్ద‌రూ అక్క‌డ్నుంచి వెళ్లిపోతుండ‌గా, కుక్క త‌ల్లిపై కూడా దాడి చేసేందుకు య‌త్నించింది. కానీ ఆమె కుక్క‌ను బెదిరించ‌డంతో అటు నుంచి అది వెళ్లిపోయింది. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ ప‌డుతున్న చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పాప ముఖంపై చాలా కుట్లు ప‌డ్డాయి. చెంప‌ల‌పై కుట్లు ఎక్కువ‌గా ప‌డిన‌ట్లు త‌ల్లిదండ్రులు పేర్కొన్నారు. చిన్నారిని కుక్క క‌రిచిన దృశ్యాల‌న్నీ అక్క‌డున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Exit mobile version