Spring Equinox | వసంత విషువత్తు అద్భుతం.. అంతరిక్షం నుంచి అబ్బురపరుస్తున్న భూగోళం..!

  • Publish Date - March 21, 2024 / 04:09 AM IST

Spring Equinox : వసంత విషువత్తు..! దీన్నే ఆంగ్లంలో ‘స్ప్రింగ్ ఈక్వినాక్స్‌’ (Spring Equinox) అంటారు. ఈ స్ప్రింగ్ ఈక్వినాక్స్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజున అంతరిక్షం నుంచి భూమి అద్భుతంగా కనిపిస్తూ అబ్బురపరుస్తుంది. భూగోళం దక్షిణార్ధం పూర్తి చీకటిగా ఉంటే.. ఉత్తరార్ధం దగదగ కాంతులు వెదజల్లుతుంది. చూడముచ్చటగా కనువిందు చేస్తుంది. పైన కనిపిస్తున్న అచ్చెరువొందించే స్ప్రింగ్‌ ఈక్వినాక్స్‌ ఫొటోను ‘యూరోపియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ద ఎక్స్‌ప్లాయిటేషన్‌ ఆఫ్‌ మెటరోలాజికల్‌ శాటిలైట్స్‌ (EUMETSAT)’ విడుదల చేసింది. ఇంతకూ ఏమిటీ వసంత విషువత్తు..? ఏమిటీ స్ప్రింగ్‌ ఈక్వినాక్స్‌..? అని అనుకుంటున్నారా..? అయితే వివరంగా తెలుసుకుందాం పదండి..

ప్రతి సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే భూమిపై రాత్రింబవళ్ల నిడివి సమానంగా ఉంటుంది. ఆ రెండు రోజుల్లో ఒకటి మార్చి 20కి అటుఇటుగా, ఇంకొకటి సెప్టెంబర్ 22కు అటుఇటుగా వస్తాయి. మార్చి 20కి అటుఇటుగా వచ్చేదాన్ని వసంత విషువత్తు లేదా స్ప్రింగ్‌ ఈక్వినాక్స్ అని అంటారు. సెప్టెంబర్ 22కు అటుఇటుగా వచ్చేదాన్ని శరద్‌ విషువత్తు లేదా ఆటమ్నల్‌ ఈక్వినాక్స్‌ (Autumnal Equinox) అంటారు. ప్రతి ఏడాదిలో మార్చి 20, సెప్టెంబర్‌ 22న సూర్యుడు భూమధ్య రేఖపై నేరుగా ఉండటంవల్ల ఈ ఈక్వినాక్స్‌ ఏర్పడుతాయి.

మొదటిదైన వసంత విషువత్తు ఏటా మార్చి 20కి అటూ ఇటుగా వస్తుంది. ఆ రోజుతో ఉత్తరార్ధ గోళం వసంత రుతువులోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఆ ప్రాంతంలో పగటి సమయం, ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ.. రాత్రిళ్ల నిడివి తగ్గుతూ వస్తుంది. ఉత్తరార్ధగోళం వెలుగునీనుతుంది. ఇక రెండోదైన శరద్‌ విషువత్తు లేదా ఆటమ్నల్‌ ఈక్వినాక్స్‌ సెప్టెంబర్‌ 22 కు అటుఇటుగా వస్తుంది. ఆ రోజుతో ఉత్తరార్ధగోళం శరద్ రుతువులోకి ప్రవేశిస్తుంది. ఈ విషువత్తులకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాధాన్యం ఉంది.

Latest News