Earthquake | వణికిస్తున్న భూకంపాలు..! ఆఫ్ఘన్‌లో 18 నిమిషాలతో తేడాతో రెండుసార్లు ప్రకంపనలు

Earthquake | ప్రపంచాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. భారత్‌, నేపాల్‌ సహా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. తుర్కియే - సిరియాలో సంభవించిన భారీ భూకంపాల ధాటికి 41వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తజికిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు 265 కిలోమీటర్ల దూరంలోని తజికిస్థాన్‌లో భూకంప కేంద్రం గుర్తించారు. ఆ తర్వాత 18 నిమిషాల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు నమోదయ్యాయి. మొదట రిక్టర్‌ స్కేల్‌పై 6.6 తీవ్రతతో ఉదయం 6.07 […]

  • Publish Date - February 23, 2023 / 03:31 AM IST

Earthquake | ప్రపంచాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. భారత్‌, నేపాల్‌ సహా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. తుర్కియే – సిరియాలో సంభవించిన భారీ భూకంపాల ధాటికి 41వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తజికిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు 265 కిలోమీటర్ల దూరంలోని తజికిస్థాన్‌లో భూకంప కేంద్రం గుర్తించారు.

ఆ తర్వాత 18 నిమిషాల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు నమోదయ్యాయి. మొదట రిక్టర్‌ స్కేల్‌పై 6.6 తీవ్రతతో ఉదయం 6.07 గంటలకు ప్రకంపనలు రాగా.. 6.28 గంటలకు రెండోసారి 5 తీవ్రత కంటే ఎక్కువగా భూకంపం సంభవించిందని యూఎస్‌ జియాలాజికల్‌ సర్వే తెలిపింది. తజికిస్థాన్‌లోని ముర్గోబ్‌కు పశ్చిమాన 67 కిలోమీటర్ల దూరంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.

అయితే, వరుస భూకంపాలతో నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. ఇదిలా ఉండగా.. బుధవారం నేపాల్‌లో భూకంపం సంభవించగా.. దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి. అంతకు ముందు రోజు తుర్కియేలో భూకంపం సంభవించగా.. ఆరుగురు మృతి చెందారు. తుర్కియే-సిరియాలో భూకంపాలు సృష్టించిన బీభత్సంతో వరుస ప్రకంపనలతో ప్రపంచవ్యాప్తంగా జనం వణికిపోతున్నారు.

Latest News