Site icon vidhaatha

Ind vs Pak | భార‌త్ ఎన్నిసార్లు ఆసియా క‌ప్ గెలిచింది.. భారత్-పాక్‌ ఫైనల్ మ్యాచ్ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ ఫ్యాన్స్

Ind vs Pak: క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తు ఆసియా క‌ప్ షెడ్యూల్ విడుద‌లైంది . పాక్‌ క్రికెట్‌ బోర్డు, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా షెడ్యూల్‌ను విడుదల చేయ‌గా, ఈ సారి టోర్నీ హైబ్రిడ్‌లో మోడల్‌లో జర‌ప‌నున్నారు. పాక్‌తో పాటు శ్రీలంకలో సైతం మ్యాచ్‌లు జరుగనుండ‌గా, పాక్‌లో పర్యటించేందుకు భార‌త జ‌ట్ట‌ నిరాకరించడంతో ఏసీసీ హైబ్రిడ్‌ మోడల్‌ను ప్రతిపాదించింది. పాక్‌లోనే ఆడాలని మొదట పీసీబీ పట్టుబట్టినా కూడా చేసేదేం లేక త‌లొంచింది. భారత్‌ తన మ్యాచులన్నింటిని శ్రీలంకలో ఆడబోతుంది. సెప్టెంబర్‌ 2న పాక్‌తో భారత జట్టు మ‌ధ్య హోరాహోరీ జ‌ర‌గ‌నుంది.

ఆసియా ఖండంలోని క్రికెట్ దేశాల మధ్య జరిగే ఆసియా కప్ టోర్నమెంట్ 1984 నుంచి జరుగుతున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.అయితే ఇప్పుటి వ‌ర‌కు 15 ఆసియా కప్‌ టోర్నీలు ఆడ‌గా, అందులో 7 సార్లు భారత జట్టే గెలిచింది. ఈ క్ర‌మంలో అత్యధిక సార్లు టోర్నీ గెలిచిన రికార్డ్ టీమిండియాపై ఉంది. ఆ త‌ర్వాత శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు ఈ టోర్నీని గెలుచుకుంది. అయితే భార‌త్ గెలిచిన సంద‌ర్భాలు చూస్తే 1984- యుఏఈ వేదికగా జరిగిన తొలి సీజన్ లో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది. ఇక 1988- బంగ్లాదేశ్‌ వేదికగా జరిగిన మూడో ఎడిషన్‌లో లంక జట్టునే మ‌ళ్లీ ఓడించి భార‌త్‌ ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.

1990/91- స్వదేశంలోనే జరిగిన నాల్గో ఎడిషన్ ఆసియా కప్‌ ఫైనల్‌లో లంక జట్టుని మ‌ళ్లీ ఓడించి భార‌త్ విజేతగా నిలిచింది.1995- ఆసియా కప్‌ ఫైనల్‌లో లంక జట్టును వరుసగా మూడో సారి ఓడించి భారత్ హ్యాట్రిక్ విజయం అందుకుంది. ఇక 2010- 15 ఏళ్ల పాటు ఆసియా కప్ అందుకోని భారత్‌.. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో ఐదోసారి టోర్నీని గెలుచుకొని భారతీయులు కాల‌ర్ ఎత్తుకునేలా చేసింది. ఇక 2016, 2018 ఎడిషన్ ఆసియా కప్ టోర్నీల్లో బంగ్లాదేశ్ జట్టుపైనే టీమిండియా గెలిచి, టైటిల్స్‌ని ద‌క్కించుకుంది . అయితే ఆసియా కప్ చరిత్రలో ఒక్కసారి కూడా భారత్, పాకిస్థాన్ టైటిల్ ఆడ‌లేదు. ఈ సారైన‌ అది జ‌రిగితే చూడాల‌ని ఫ్యాన్స్ ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version