వారెవ్వా.. జాతి రత్నాలు బ్యూటీకి ఎవరైన ఫిదా కావల్సిందే.. ఏమందం సామి..!జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా పరిచయమైన ఫరియా అబ్ధుల్లా అంత ఈజీగా మరచిపోయే పీస్ కాదు. తొలి సినిమాలోనే తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ హైదరాబాద్ బ్యూటీ తన గ్లామర్ తోనే కాకుండా.. కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంది . మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి అగ్ర స్టార్ హిరో ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరు అనుకున్నారు.
కాని ఆమె కెరీర్ అంత ఆశాజనకంగా ఏమి లేదు. జాతిరత్నాలు తెచ్చిపెట్టిన క్రేజ్ పెద్దగా అవకాశాలు అందించలేకపోతుంది. కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్ పోషించిన ఫరియా హీరోయిన్‌గా మంచి అవకాశం ఒక్కటి కూడా అందుకోలేకపోతుంది. ఛాన్స్ వస్తే తనంటే ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తుంది.
తాజాగా ఫరియా అబ్ధుల్లా కేక పెట్టించే అందాలతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. వయోలెట్ కలర్ డ్రెస్‌లో ఈ అందాల ముద్దుగుమ్మ మైండ్ బ్లోయింగ్ అనేలా కనిపిస్తుంది. అసలు ఫరియాని ఇలా చూసి ఎవరైన మైమరచిపోవడం ఖాయం. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ మతులు పోగొడుతున్నాయి. తళతళ మెరిసిపోతున్న ఫరియాని చూసి కుర్రాళ్లు కలలలో తేలిపోతున్నారు. ఇంత అందం ఉన్న బ్యూటీకి ఎందుకు ఛాన్స్ లు రావడం లేదంటూ కొందరు ఆలోచన చేస్తున్నారు. ఏదేమైన ఫరియా అబ్ధుల్లా అందాలు మాత్రం కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.
మంచి అవకాశాల కోసం ఈ అమ్మడు ఎంత ట్రై చేస్తున్నా కూడా అవకాశాలు దరిచేరడం లేదు. పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా ఈ అందాల ముద్దుగుమ్మ సిద్ధమైంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున , నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కిన ‘బంగార్రాజు’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరిని ఫిదా చేసింది. ఫరియా అబ్ధుల్లా స్పెషల్ సాంగ్ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేసింది. ఫరియాకి ఛాన్స్ రావాలేగాని తానేంటే తప్పక నిరూపించుకుంటుందని అంటున్నారు.