KOTAMREDDY | హమ్మయ్య.. కోటంరెడ్డికి పిలుపొచ్చింది!

KOTAMREDDY | విధాత‌: జగన్ను తిట్టి బయటకు వచ్చారు.. జగన్ ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యారు.. ఇక టిడిపిలో చేరడమే తరువాయి అన్నట్లుగా ఉన్నారు.. ఇక ఇటేమో టిడిపి నుంచి పెద్దగా ఆసక్తి కనబడడం లేదు.. కొంపదీసి అటూ ఇటూ కాకుండా ఉండిపోతారా ఏమో భయపడుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నిరీక్షణ ఫలించింది. ఆయనకు టిడిపి నుంచి పిలుపు వచ్చింది . త్వరలో లోకేష్ పాదయాత్ర ఇటు ఈయన నియోజకవర్గం వైపు […]

  • Publish Date - June 27, 2023 / 12:06 PM IST

KOTAMREDDY |

విధాత‌: జగన్ను తిట్టి బయటకు వచ్చారు.. జగన్ ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యారు.. ఇక టిడిపిలో చేరడమే తరువాయి అన్నట్లుగా ఉన్నారు.. ఇక ఇటేమో టిడిపి నుంచి పెద్దగా ఆసక్తి కనబడడం లేదు.. కొంపదీసి అటూ ఇటూ కాకుండా ఉండిపోతారా ఏమో భయపడుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నిరీక్షణ ఫలించింది. ఆయనకు టిడిపి నుంచి పిలుపు వచ్చింది .

త్వరలో లోకేష్ పాదయాత్ర ఇటు ఈయన నియోజకవర్గం వైపు సాగనున్న తరుణంలో ఆయనను పార్టీలో చేరాల్సిందిగా నెల్లూరు జిల్లా టిడిపి నేతలు పిలుపుజేశారు. టిడిపి యువ నాయకుడు లోకేష్ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు భారీ మద్దతు కూడా ఇప్పుడు అవసరం. వాస్తవానికి గత ఎన్నికల్లో మొత్తం పది సీట్లనూ ఊడ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ టిడిపికి కొత్త సవాల్ విసురుతోంది.

ఈ తరుణంలో నెల్లూరు జిల్లాలో టిడిపి బలాన్ని పుంజుకోవాల్సిన అవసరటం ఉంది. ఈ ఆలోచించిన చంద్రబాబు ఇప్పుడు కోటంరెడ్డిని టిడిపిలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు భేటీ అయి కోటంరెడ్డిని టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. దీనికి కోటంరెడ్డి సైతం సమ్మతించారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర నడిపే బాధ్యత తనకు అప్పగించడం పట్ల కోటంరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే కోటం రెడ్డిని టిడిపిలోకి తీసుకునే పెద్దగా ప్రాధాన్యం ఉండదు.. ఆయన ఇమేజ్ కాస్తా పలుచబడిపోతుందని భావించిన చంద్రబాబు ఇన్నాళ్లు వెయిట్ చేసి ఇప్పుడు లోకేష్ పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోకి ప్రవేశించినపుడు ఈయన్ను పార్టీలోకి తీసుకుంటున్నారు. ఇది లోకేష్ యాత్రకు కాస్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.

Latest News