Site icon vidhaatha

గ్రే గోల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి

విధాత: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కేంద్రంలోని గ్రే గోల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీ లో సోమవారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

ప్రమాదంలో మునగపాటి సైదులు (43) ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని హుజుర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పట్టేటి సాయి కుమార్ (24)కు తీవ్ర గాయాలవ్వగా హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో అతనూ కూడా మృతి చెందాడు. మరో కార్మికుడు సైదులు కు స్వల్ప గాయాలు.

క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ అంబులెన్స్ లో హైదరాబాదుకు తరలించారు. గత నవంబరు నెలలో ఇలాంటి ప్రమాదంలోనే సైదులు అనే వ్యక్తి మృతి చెందాడం గమనార్హం.

Exit mobile version