Accident | నిజామాబాద్ జిల్లా( Nizamabad )లో ఘోర ప్రమాదం జరిగింది. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి వద్ద కారు – కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను మహారాష్ట్ర( Maharashtra ) వాసులుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.