Site icon vidhaatha

Ganesh Chaturthi Celebrations | అంబాని ఇంట అట్ట‌హాసంగా వినాయ‌క చ‌వితి వేడుక‌లు.. హాజ‌రైన సినీ స్టార్స్, క్రికెట‌ర్స్

Ganesh Chaturthi Celebrations |

దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి ఓ రేంజ్‌లో ఉంది. ప‌ల్లెలు, ప‌ట్టణాల‌లో వీధి వీధినా గణేష్‌ ప్రతిమలు కొలువు దీరాయి. కోటీశ్వరుడి దగ్గరినుంచి పేదవారి వరకు తమ తాహతకు తగ్గట్టు వినాయకుల్ని ఏర్పాటు చేసుకొని గ‌ణ‌నాధుడిని కొలుస్తున్నారు. ఇక ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ తన రేంజ్‌కు తగ్గట్టు ఇంట్లో కూడా వినాయక విగ్రహం ఏర్పాటు చేసి భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజాలు చేశారు.

అనంత‌రం ఆయ‌న లాల్‌బగీచా రాజాను దర్శించుకున్నారు. త‌న కుమారుడితో క‌లిసి అక్క‌డికి వెళ్లిన అంబాని ఈ సారి 2 వేల నోట్ల రూపాయలతో తయారు చేసిన పెద్ద దండను వినాయకుడికి ఇచ్చారు .ఆ దండ‌ని చూసిన నెటిజ‌న్స్ అంబానీకి త‌గ్గ‌ట్టుగానే ఉంద‌ని అంటున్నారు.

అంబానీ ఏం చేసినా అది ఖరీదుగానే ఉంటుంది. దేవుడి పూజ చేసినా అంతే, అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ముంబైలోని యాంటిలియాలో ముకేష్ అంబాని, నీతూ అంబాని గ‌ణేష్ చ‌తుర్ధి సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించారు.

ఈ వేడుక‌కి సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, క్రికెట‌ర్స్ కూడా హాజ‌ర‌య్యారు. షారూఖ్ ఖాన్ త‌న భార్య గౌరీ ఖాన్‌తో పాటు కుమార్తె, కుమారుల‌తో క‌లిసి వేడుక‌లో సంద‌డి చేశారు. ఇక స‌ల్మాన్ ఖాన్ త‌న మేన కోడ‌లితో సంద‌డి చేశాడు. అందాల భామ ఐశ్వ‌ర్య‌రాయ్ త‌న కూత‌రు ఆరాధ్య‌తో క‌లిసి అంబాని ఇంట్లో మెరిసింది.

Exit mobile version