Site icon vidhaatha

Dipa Karmakar | డోపింగ్‌ టెస్టుల్లో దీపా కర్మాకర్‌ విఫలం.. 21 నెలల పాటు ఐటీఏ నిషేధం

Gymnast Dipa Karmakar | భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై ఐటీఏ 21 నెలల పాటు నిషేధం విధించింది. యాంటీ డోపింగ్‌ టెస్టుల్లో భారత స్టార్‌ జమ్నాస్ట్‌ పట్టుబడడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇంటర్నేషనల్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌ మార్గదర్శకాలను పాటించడంలో దీపా ఫెయిల్‌ కావడంతో ఈ ఏడాది జూలై వరకు ఆమెను సస్పెండ్ చేశారు. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌లో దీపా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే, దీపా కర్మాకర్ హైజెనామైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమెపై అంతర్జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది.

వాస్తవానికి 2021 అక్టోబర్ 11న దీపా కర్మాకర్ నుంచి శాంపిల్స్ సేకరించారు. కానీ, ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. అయితే, శిక్షాకాలం అప్పటి నుంచే అమలుకావడంతో ఈ ఏడాది జూలై 10వ తేదీతోనే నిషేధం ముగియనున్నది. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు, రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన ప్రతీ అథ్లెట్, ప్రతీ ఏడాది యాంటీ డోపింగ్ టెస్టు కోసం నమూనాలు సమర్పించాల్సి ఉంటుంది. సాంపిల్స్ సమర్పించకపోతే వారిపై ఏడాది నుంచి రెండేళ్ల వరకూ నిషేధం విధించే అవకాశాలుంటాయి.

Exit mobile version