Cricket | ఈ రోజుల్లో క్రికెట్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అన్ని గేమ్స్ లో కన్నా ఈ గేమ్‌కి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఇక ఇండియాలో క్రికెట్ అంటే ఒక్కొక్కరికి పూనకాలు వచ్చేస్తాయి. ఇండియా జట్టు మ్యాచ్ ఆడుతుంది అంటే గ్రౌండ్ నిండిపోవల్సిందే. రేటు ఎంతైన టిక్కెట్ కొని మరీ మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు.
ఇక కొందరు అయితే గల్లీ క్రికెట్ ఆడుతూ సంబర పడుతుంటారు. కుల, మతాలు, చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్రికెట్‌ని ఎంతో ఇష్టపడుతూ వస్తున్నారు. తాజాగా ఒక గల్లీ క్రికెట్ లో అంగవైకల్యంతో ఉన్న వ్యక్తి చేసిన బౌలింగ్ ప్రతి ఒక్కరి గుండెల్ని హత్తుకునేలా ఉంది.
వివారాలలోకి వెళితే సాధారణంగా మనం ఏ ఆట ఆడాలన్నా కూడా కాళ్లు చేతులు సరిగా ఉండాలి. అలా ఉన్నా కూడా కొందరు పెద్దగా రాణించలేరు. అయితే సాధించాలనే పట్టుదల, ఇష్టం ఉంటే వైకల్యం కూడా అడ్డు రాదని నిరూపించాడు ఓ వ్యక్తి.
తనకి రెండు చేతులు లేకపోయినా కూడా అదిరిపోయే యార్కర్ సంధించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ విషయం చెబితే ఎవరికైన నమ్మడం కష్టమే. చూస్తే మాత్రం నోరెళ్లపెట్టడం ఖాయం. ఆ వ్యక్తి నేల మీద ఉన్న బంతిని ఎడమ కాలుతో అదిమిపట్టి బలంగా వికెట్ల వైపుకి విసిరాడు.
అలా విసిరిన బంతి సరాసరి బ్యాటర్ వైపుగా వెళ్ళింది. అంతే కాదు ఆ బాల్ యార్కర్ గా వెళ్లడం తో అందరు షాక్ అయ్యారు. అతని స్కిల్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ కూడా అతని ప్రతిభకి ఫిదా అయిపోయి.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతడే అసలైన క్రికెట్ ప్రేమికుడు అంటూ క్యాప్షన్ జోడించాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోతెగ హల్ చల్ చేస్తుంది.. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి నెటిజన్స్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. టాలెంట్‌కి అంగవైకల్యం మనిషికి అడ్డం కాదు అని నిరూపించిన ఈ కుర్రాడిని ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసిస్తున్నారు.
Ye hain asli cricket lover, kya baat hain aapne to ❤️ jeet liya pic.twitter.com/Js1gfYXiAL
— Munaf Patel (@munafpa99881129) July 11, 2023