విధాత: ఉత్తరాఖండ్‌లోని వానంతర రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకిత బండారి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తమ కూతురు అంకితను హత్య చేసిన నిందితులను ఉరి తీయాలని ఆమె తండ్రి డిమాండ్ చేశారు. తక్షణమే పోస్టుమార్టం రిపోర్టును విడుదల చేయాలన్నారు.
ఈ కేసును పోలీసులు త్వరగా ఛేదించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో రెవెన్యూ అధికారి అలసత్వం వహించారని అంకిత తండ్రి ఆరోపించారు. అంకిత హత్య కేసులో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే రిసార్ట్‌కు వచ్చిన అతిథుల కోరికలను తీర్చాలని పుల్కిత్ ఆర్య, అంకితను వేధించాడు. ఆమె అందుకు అంగీకరించక పోవడంతో రిసార్ట్‌కు సమీపంలోని పవర్ హౌజ్ డ్యామ్‌లో తోసేసి చంపేశాడు. అయితే తన కుమారుడు పుల్కిత్ ఆర్య అమాయకుడు అని ఆయన తండ్రి వినోద్ ఆర్య పేర్కొన్నారు. అంకితను పుల్కిత్ హత్య చేశాడని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
అతనికి తన బిజినెస్ మాత్రమే తెలుసని, ఇలాంటి వ్యవహారాల్లో తల దూర్చడని వినోద్ ఆర్య పేర్కొన్నారు. తన కుమారుడు పుల్కిత్‌కు, అంకితకు న్యాయం జరగాలని వినోద్ తెలిపారు. అంకిత హత్య కేసు వెలుగులోకి రావడంతో వినోద్ ఆర్య, ఆయన కుమారుడు అంకిత్ ఆర్యను బీజేపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే.